తన అన్న నాగబాబు కుమార్తె, టాలీవుడ్ హీరోయిన్ నిహారిక నిశ్చితార్థానికి జనసేనాని పవన్‌కల్యాణ్ గైర్హాజర్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం బిజినెస్‌మెన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారుడు.
కానీ నాగబాబు తమ్ముడు పవన్‌కల్యాణ్ హాజరు కాకపోవడంపై టాలీవుడ్‌లో పలు రకాలుగా చర్చ సాగుతోంది. ఇటీవల నాగ బాబు, పవన్ మధ్య సంబంధాల్లో కొంత గ్యాప్ ఏర్పడిందనే వాదన వినవస్తోంది. అందువల్లే పవన్, ఆయన కుటుంబ సభ్యలెవరూ నిహారిక నిశ్చితార్థ వేడుకకు హాజరు కాలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల హీరో నితన్ పెళ్లికి పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ వెళ్లి ఆశీర్వదించడాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. నిజంగా పవన్‌కల్యాణ్ చాతుర్మాస్య దీక్షలో ఉండడం వల్లే నిశ్చితార్థానికి రాలేదనుకుంటే…మరి నితిన్ పెళ్లికి ఎలా వెళ్లాడని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ పవన్‌కు ఏదైనా ముఖ్యమైన పని ఉందనుకుంటే…కనీసం ఆయన భార్య, పిల్లల్ని అయినా పంపొచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నాగబాబు, పవన్ మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో ఉందని, అది ఇప్పుడు బయట పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అన్నదమ్ముళ్లో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.