cloudfront

Advertisement


Home > Movies - Movie News

సెక్సువల్ వేధింపుల బాధితురాలినేనన్న మరో నటి!

సెక్సువల్ వేధింపుల బాధితురాలినేనన్న మరో నటి!

తను కూడా సెక్సువల్ వేధింపుల బాధితురాలినేనని చెప్పింది నటి ప్రియాంక చోప్రా. మహిళలు అంతా ఈ ప్రపంచంలో అలాంటి వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారని, దానికి తను కూడా మినహాయింపు కాదని పీసీ వివరించింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ వ్యాఖ్యలను చేసింది.

ఆ ఇంటర్వ్యూలో 'ఎప్పుడైనా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ చెయ్యి పైకెత్తి.. 'ఔను.. నేనూ బాధితురాలినే' అని ప్రియాంక వివరించింది. అందరిలాగే తనూ అని ప్రియాంక చెప్పింది. అయితే తను ఎలాంటి వేధింపులను ఎదుర్కొన్నది, ఎప్పుడు వేధించబడినది ప్రియాంక వివరించలేదు.

ఇటీవలి కాలంలో 'మీటూ' ఉద్యమం చెలరేగిన సంగతి తెలిసిందే. అప్పుడు పెద్దగా మాట్లాడలేదు ప్రియాంక. ఇప్పుడు ఆమె స్పందించారు. అయితే పూర్తిగా వివరించలేదు. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఈ భారతీయ నటీమణి కూడా ఇలా 'మీటూ' అంటున్నారు!

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!