పెద్ద హీరోల వెనకడుగు?

పోస్ట్ కరోనా నేపథ్యంలో టాలీవుడ్ లో షూటింగ్ లు ప్రారంభమవుతున్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరి కొన్ని అక్టోబర్ ఫస్ట్ వీక్ లో షెడ్యూలు చేసుకుంటున్నాయి. నవంబర్ నుంచి పెద్ద…

పోస్ట్ కరోనా నేపథ్యంలో టాలీవుడ్ లో షూటింగ్ లు ప్రారంభమవుతున్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరి కొన్ని అక్టోబర్ ఫస్ట్ వీక్ లో షెడ్యూలు చేసుకుంటున్నాయి. నవంబర్ నుంచి పెద్ద హీరోలు అందరూ దాదాపుగా సెట్ మీద వుంటారని వార్తలు వినవస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పడు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ట్ అయిన షూటింగ్ లు, వాటి వల్ల మళ్లీ ఎవరికైనా కరోనా వచ్చిందా? అన్న విషయాలు పెద్ద హీరోలు ఆరా తీస్తున్నట్లు బోగట్టా.  చాలా యూనిట్ ల్లో ఒకరో ఇద్దరికో కరోనా సోకుతున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఓటిటి కోసం వెబ్ సిరీస్ చేస్తున్న దర్శకుడు సుధీర్ వర్మకు కూడా కరోనా లక్షణాలు కనిపించాయని తెలుస్తోంది.

ఇవన్నీ తెలుసుకున్న తరువాత పెద్ద హీరోలు మళ్లీ మనసు మార్చుకునే అవకాశం వుందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు షూట్ అంతా అమెరికాలో కాబట్టి దానికి సమస్య లేదు. కానీ వకీల్ సాబ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, ఆచార్య ఇలా ఈ సినిమాలు అన్నింటికీ ఆయా హీరోలు రావడానికి ఇంకా టైమ్ పడుతుందేమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు