
తనకు చాలా మంది పిల్లలను కనాలని ఉందని అంటోంది ప్రియాంకా చోప్రా. ఆ మధ్య అమెరికన్ కుర్రాడిని పెళ్లి చేసుకుని, హ్యాపీగా సంసారం సాగిస్తున్న ఈ నటీమణి తాజాగా పిల్లల విషయంలో తన స్టేట్ మెంట్ ఇచ్చింది.
వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని తనకు ఉందని ప్రియాంక చెబుతోంది. అందుకు తగ్గట్టైన వ్యక్తి తన జీవితంలో ఉన్నాడని.. అతడితో పిల్లల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వీలైనంత మందిని కనాలని ఉందని ప్రియాంక చెబుతోంది.
తమ సంసార జీవితం గురించి బోల్డ్ స్టేట్ మెంట్లు ఇవ్వడానికి ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వెనుకాడటం లేదు. పెళ్లి తర్వాత సెక్స్ అనేది బోర్ కొట్టదని ఆ మధ్య విద్యాబాలన్ తన స్వీయానుభవాన్ని చెప్పుకుంది.
సెక్స్ తరచూ ఉండాల్సిందేనంటూ సమంత కూడా ఒక మ్యాగజైన్ తో వ్యాఖ్యానించింది. ఇప్పుడు పెళ్లైన ప్రియాంక పిల్లల గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది.
కుటుంబ నియంత్రణ పాటించే ఉద్దేశం లేదని ఇలా చెబుతోంది ప్రియాంక. ఎక్కువ మంది పిల్లలు కలగడం అనేది తమ దాంపత్య ఆనందానికి ప్రతీక అంటోంది.
ఇండియాలో అయితే కుటుంబ నియంత్రణ లేకపోతే అదెవరికైనా కష్టమే కానీ.. అమెరికాలో మాత్రం ఆ ఇబ్బంది ఉండదేమో! పాశ్చాత్య నాగరికతలో ఎంత మంది పెళ్లి, పిల్లలు అంటారో కానీ.. పిల్లలను కలిగిన సెలబ్రిటీల్లో మాత్రం నియంత్రణ ఏమీ అంతగా కనిపించదు.
పలువురు క్రికెటర్లు, హాలీవుడ్ స్టార్లు కూడా ముగ్గురు, నలుగురు పిల్లలను కూడా కలిగి ఉన్నారు. మరి కొందరు పిల్లలను అడాప్ట్ చేసుకుని కూడా సొంతంగా పిల్లలను కలిగిన వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక వారి సరసన స్థానం సంపాదిస్తుందేమో!
దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు