ఎన్డీఎ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి బాహాటంగా ఎవరూ ముందుకు రాలేదు. ఎవరికి వారు ఆంధ్ర వెళ్లి, గెలిచిన వారిని అభినందించి రావడం తప్ప. ఇండస్ట్రీ మొత్తం ఏం ప్లాన్ చేయలేదు. కానీ పీపుల్స్ మీడియా సంస్థ నేరుగా ముందుకు వచ్చింది. పీపుల్స్ మీడియా, దాని అనుబంధ సాఫ్ట్ వేర్ సంస్థ పీపుల్ టెక్ కలిసి ఆంధ్రలో ఎన్డీఎ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ భారీ పార్టీ హోస్ట్ చేస్తున్నాయి.
సంధ్య కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఇండస్ట్రీకి చెందిన దాదాపు మూడు వేల మందిని ఆహ్వానించారని తెలుస్తోంది. పెద్దలు ఎవరు వస్తారు అన్నది ఇంకా తెలియదు. మెగాస్టార్ వస్తారా? పవన్ వస్తారా? నాదెండ్ల మనోహర్ వస్తారా? అన్నది తెలియాల్సి వుంది. ఎందుకంటే వీళ్లంతా పీపుల్స్ మీడియాకు సన్నిహితులే.
మరి ఎవరు ఎవరు వస్తారో చూడాలి. మూడు వేల మందికి ఆహ్వానం, పార్టీ అంటే మామూలుగా వుండదు. కేవలం పార్టీయేనా, చిన్న పాటి ప్రసంగాలు వుంటాయ? ఫంక్షన్ ఎలా వుండబోతోంది అన్నది తెలియాల్సి వుంది. ప్రస్తుతానికి అయితే కేవలం డిన్నర్ చేసి వెళ్లాలని, ఎటువంటి కెమేరాలు, షూట్ లు వద్దని మీడియాకు సమాచారం అందింది.