cloudfront

Advertisement


Home > Movies - Movie News

బిగ్ బాస్ ను ఆపేయండి.. కోర్టులో పిటిషన్!

బిగ్ బాస్ ను ఆపేయండి..  కోర్టులో పిటిషన్!

టీవీ కార్యక్రమాలు, సినిమాల విషయంలో కోర్టులకు ఎక్కడంతో తమిళనాడు వాళ్లు ముందుంటారు. అక్కడ పెద్ద హీరోల సినిమాలు ఏవి వస్తున్నా వాటిపై కోర్టులో పిటిషన్లు పడకుండా ఉండటం అరుదు. ఏదో ఒక అంశాన్ని పట్టుకుని అభ్యంతరాలు చెబుతూ సదరు హీరోలను న్యాయస్థానాల ద్వారా ముప్పుతిప్పలు పెడుతూ ఉంటారు కొంతమంది.

ప్రచార అర్భాటాల కోసం కొందరు, అర్థంలేని అభ్యంతరాలతో మరి కొందరు రచ్చ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో తమిళ బిగ్ బాస్ మీద కూడా అలాంటి పిటిషనే దాఖలు అయ్యింది. కమల్ హాసన్ హోస్టుగా సాగుతున్న ఈ కార్యక్రమం ఈసారి కూడా అక్కడ మూడో సీజన్ ప్రారంభం కానుంది.

మూడో సీజన్ కు కూడా కమల్ హాసనే హోస్టుగా వ్యవహరించబోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ ప్రోగ్రామ్ పై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. ఆ కార్యక్రమం తీరు సరిగాలేదని, అందులో పాల్గొనేవారు పొట్టి దుస్తుల్లో ఉంటారని, వారు వ్యవహరించే తీరు పిల్లలను తప్పుదోవ పట్టించేలా ఉందని అంటూ.. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆపాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు అయ్యింది.

థర్డ్ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఈ పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై న్యాయస్థానం ఏమంటుందో!

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు