cloudfront

Advertisement


Home > Movies - Movie News

పోకిరి రేంజ్‌ ట్విస్ట్‌ ఉందట!

పోకిరి రేంజ్‌ ట్విస్ట్‌ ఉందట!

పూరి జగన్నాథ్‌ 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో మళ్లీ ఫామ్‌లోకి వస్తానని ఫుల్‌ ధీమాతో వున్నాడు. తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా నిలబెట్టడం కోసం కసిగా రాసుకున్న కథ ఇది. అయితే కథ రెడీ అయిన తర్వాత ఎవరైనా పేరున్న హీరోతో చేస్తే మంచిదని పలువురు సూచించారట. అందుకే తన బడ్జెట్‌ సహకరించకపోయినా రామ్‌ని కథానాయకుడిగా ఎంచుకున్నాడు.

ఈ చిత్రంలో 'పోకిరి' సినిమా తరహాలో క్లయిమాక్స్‌లో దిమ్మ తిరిగే ట్విస్ట్‌ వుంటుందని, కమర్షియల్‌ విలువలు, పూరి మార్కు డైలాగులు దండిగా వుంటాయని చెబుతున్నారు. కథా పరంగా కూడా పూరి కొత్తదనం చూపించాడట. ఇంతవరకు ఇంత 'తిక్క' క్యారెక్టరైజేషన్‌ పూరి సినిమాల్లో చూసి వుండరని, ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌తోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ పండుతుందని అంటున్నారు.

పూరి ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా ఈ కథ విన్న తర్వాత రామ్‌ రిజెక్ట్‌ చేయలేకపోయాడట. అంతకుముందే ఓకే చేసిన కథలని కూడా పక్కన పెట్టేసి వెంటనే ఇది చేయడానికి సిద్ధపడిపోయాడట. రామ్‌ బాడీ లాంగ్వేజ్‌, డిక్షన్‌, పర్‌ఫార్మెన్స్‌ అన్నీ చాలా వైవిధ్యంగా వుంటాయని, ఒక విధంగా ఇది పూరి జగన్నాథ్‌ని తిరిగి టాప్‌ లీగ్‌లోకి చేర్చే చిత్రమవుతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇదంతా కేవలం హైప్‌ మేటరేనా లేక నిజంగానే అంత వుందా అనేది చూడాలి. 

నాకు ఆవిడంటే చాలా ఇష్టం : వీరమాచినేని 

నాకు స్టామినా చాలా ఎక్కువ