Advertisement


Home > Movies - Movie News
పూజా వచ్చింది.. సెట్స్ లో ఒకటే సందడి

మొన్నటివరకు సెట్స్ లో ఎన్టీఆర్ మాత్రమే కనిపించాడు. డైలాగ్ చెప్పినా, ఫైట్ చేసినా అన్నీ తారక్ చుట్టూనే. కానీ ఇప్పుడు సెట్ కు ఓ అందమొచ్చింది. ఎందుకంటే ఎట్టకేలకు సెట్స్ పైకి పూజా హెగ్డే వచ్చింది. అవును.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సెట్స్ పైకి పూజా హెగ్డే జాయిన్ అయింది.

ఈరోజు తారక్-పూజా కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు తీశారు. ఈనెల 9న ప్రారంభమైన ఈ షెడ్యూల్ మరో 10రోజుల పాటు కొనసాగుతుంది. దీని తర్వాత జరగనున్న మరో 2షెడ్యూల్స్ లో కూడా పూజా హెగ్డే పాల్గొంటుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో ఆమెకు సంబంధించి కీలకమైన సన్నివేశాలన్నీ పూర్తిచేయాలని నిర్ణయించారు.

సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే క్యారెక్టర్ కాదట పూజాది. కథ ప్రకారం ఆమెది చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. పాటల్లో చిందేయడమే కాకుండా, మంచి పెర్ఫార్మెన్స్ కు ఆస్కారం ఉన్న క్యారెక్టర్ అట. అందుకే కనెక్టివిటీ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో వరుసగా కాల్షీట్లు ఇచ్చిందట పూజ.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి తమన్ ఇప్పటికే 2ట్యూన్స్ ఇచ్చాడు. ప్రారంభమలో త్రివిక్రమ్-తమన్ మధ్య సింక్ కుదరనప్పటికీ.. ఎట్టకేలకు 2మంచి ట్యూన్స్ తో త్రివిక్రమ్ ను మెప్పించాడు తమన్. ఇదే ఊపులో మిగతా ట్యూన్స్ కూడా ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.