cloudfront

Advertisement


Home > Movies - Movie News

పూజాహెగ్డేను కూడా వదలని త్రివిక్రమ్

పూజాహెగ్డేను కూడా వదలని త్రివిక్రమ్

అరవింద సమేత చిత్రంలో పూజాహెగ్డే సొంతంగా డబ్బింగ్ చెబుతోంది. ప్రస్తుతం ఆ డబ్బింగ్ వర్క్ నడుస్తోంది. ఇదేదో ఆమె ఇష్టపడి చెప్పుకుంటున్న డబ్బింగ్ కాదు. నిజానికి పూజాహెగ్డేకు పూర్తిస్థాయిలో తెలుగు రాదు. ఆమెకు తెలుగులో మాట్లాడ్డం కూడా రాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో అరవింద పాత్రకు డబ్బింగ్ చెప్పేస్తోంది. దీనికి కారణం త్రివిక్రమ్ అని తెలుస్తోంది.

ఎందుకో ఈ పాత్రకు పూజా హెగ్డేతోనే డబ్బింగ్ చెప్పించాలని ముందు నుంచే ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్. అందుకే పట్టుబట్టి మరీ ఆమెతోనే తెలుగులో డబ్బింగ్ చెప్పించాడు. గతంలో అజ్ఞాతవాసి విషయంలో కూడా ఇలానే చేశాడు ఈ దర్శకుడు. అస్సలు తెలుగు రాకపోయినా అను ఎమ్మాన్యుయేల్ తో డబ్బింగ్ చెప్పించాడు. కొంచెం కొంచెం తెలుగు వచ్చిన కీర్తిసురేష్ తో కూడా పూర్తిస్థాయిలో డబ్బింగ్ చెప్పించాడు.

ఇప్పుడు అజ్ఞాతవాసి ఫార్ములానే అరవింద సమేత చిత్రానికి కూడా ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఇషారెబ్బా నటిస్తోంది. ఎలాగూ తెలుగమ్మాయే కాబట్టి ఆ పాత్రకు ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఒరిజినల్ గా పూజాహెగ్డే వాయిస్ చాలా హస్కీగా ఉంటుంది. అయినప్పటికీ త్రివిక్రమ్ ఆమెతోనే డబ్బింగ్ చెప్పిస్తున్నాడు. ఈ మేరకు కష్టపడి డైలాగులు నేర్చుకొని మరీ డబ్బింగ్ చెబుతోంది పూజాహెగ్డే.

అసలే సినిమా విడుదలకు చాలా తక్కువ టైం ఉంది. మరోవైపు షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ భారీగా పెండింగ్ ఉంది. ఇలాంటి టైమ్ లో పూజాహెగ్డేతో డబ్బింగ్ చెప్పించడం లాంటి ప్రయోగాలు అవసరమా!