Advertisement

Advertisement


Home > Movies - Movie News

హనీమూన్ తో ముగిసిన వైవాహిక జీవితం

హనీమూన్ తో ముగిసిన వైవాహిక జీవితం

రెండేళ్లు కలిసి సహజీవనం చేశారు. ఆ టైమ్ లో ఎప్పుడూ గొడవలు జరగలేదు. తర్వాత నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ టైమ్ లో కూడా ఇద్దరూ ప్రేమగానే ఉన్నారు. చివరాఖరికి పెళ్లి కూడా చేసుకున్నారు. అది కూడా ఉన్నంతలో గ్రాండ్ గానే జరిగింది. ఎప్పుడైతే హనీమూన్ పెట్టుకున్నారో అప్పుడే మొదలైంది అసలు రచ్చ.

ఇష్టపడి చేసుకున్న శామ్ బాంబేను హనీమూన్ కూడా పూర్తికాకుండానే వదిలేసింది హాట్ బ్యూటీ పూనమ్ పాండే. హనీమూన్ గడుపుతున్న రోజుల్లోనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కి.. భర్త తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదుచేసింది.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న గోవా పోలీసులు.. వాళ్ల హనీమూన్ ను బ్రేక్ చేశారు. భర్త శామ్ బాంబేను తీసుకెళ్లి జైళ్లో పెట్టారు. దీంతో శామ్ కు ఎక్కడో కాలింది. బెయిల్ పై బయటకొచ్చిన అతడు నేరుగా తన సూట్ కేస్ సర్దుకొని ముంబయి వచ్చేశాడు.

ఈ మొత్తం వ్యవహారంపై పూనమ్ పాండే రాత్రి స్పందించింది. ఏడు జన్మల బంధం అనుకున్న తమ వైవాహిక జీవితం 7 రోజులు కూడా గడవలేదని బాధపడింది. ఇకపై శామ్ తో కలిసి జీవించేది లేదని తెగేసి చెప్పేసింది.

రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ జంటకు ఇప్పట్లో విడాకులు మంజూరు కావు. కనీసం 6 నెలల పాటు వెయిట్ చేసి, ఆ తర్వాత విడాకులకు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్ ఎస్తేర్, సింగర్ నోయల్ వైవాహిక బంధం కూడా ఇలానే ముగిసింది. 

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట కూడా పెళ్లయిన రెండో రోజుకే విడిపోయింది. తాజాగా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు పూనమ్ పాండే-శామ్ బంధం కూడా ఇలానే రోజుల వ్యవథిలో వీగిపోయింది.

పవన్, బాబు ఒకరికి ఒకరు

అందరూ కలిసి బైటకి పంపేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?