cloudfront

Advertisement


Home > Movies - Movie News

వాత పెట్టి వెన్న రాస్తున్న వర్మ

వాత పెట్టి వెన్న రాస్తున్న వర్మ

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ (వాక్-స్వాతంత్ర్యం ) పేరిట రామ్ గోపాల్ వర్మ మరింత రెచ్చిపోతున్నాడు. ట్విట్టర్ లో ఇష్టమొచ్చినట్టు రాతలు రాయడం ప్రారంభించాడు. మొన్నటివరకు జీఎస్టీ అంటూ అడల్ట్ మూవీతో హంగామా చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు పవన్ పై ఏకంగా పోర్న్ కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ట్రెండింగ్ చేయడం షురూ చేశాడు.

"ప్రస్తుతం పోర్న్, పవన్.. ఈ రెండింటికి పిచ్చ పాపులారిటీ ఉంది. పోర్న్ కల్యాణ్ అనేది అల్టిమేట్ బ్రాండ్ అవుతుందనేది నా ఆలోచన. వ్యక్తిగతంగా నాకు పోర్న్ మరియు పవన్ ఇద్దరూ ఇష్టమే." ఇలా ప్రకటించిన వర్మ ట్విట్టర్ లో మీకు ఎక్కువగా పోర్న్ ఇష్టమా..? పవన్ ఇష్టమా..? అంటూ ఏకంగా ఓ సర్వేకు తెరతీశాడు.

పవన్ కల్యాణ్ మామూలు వ్యక్తి కాదు. కోట్ల మంది తెలుగు ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి. ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. ఇలాంటి వ్యక్తికి మర్యాద ఇవ్వడం కనీస బాధ్యత. ఆ విషయాన్ని విస్మరించిన వర్మ, పవన్ కల్యాణ్ ను పోర్న్ కల్యాణ్ అని పిలవడం బాధాకరం. ఇది కచ్చితంగా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడమే.

తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో వర్మ మళ్లీ పవన్ పై పొగడ్తలు షురూ చేశాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ కీలకంగా మారుతుందని ట్వీట్ చేశాడు. ఇలా పవన్ ను కాసేపు పొగడ్డం, మరికాసేపు తిట్టడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య.