cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పోస్ట్ ప్రొడక్షన్ లకు గ్రీన్ సిగ్నల్?

పోస్ట్ ప్రొడక్షన్ లకు గ్రీన్ సిగ్నల్?

టాలీవుడ్ కు శుభవార్త. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి దాదాపు అనుమతి వచ్చేసినట్లే. ఈ మేరకు మంత్రి తలసాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో, ఆయన సారధ్యంలో జరిగిన సినిమా ప్రముఖుల సమావేశంలో ఈ మేరకు మంత్రి తలసాని హామీ ఇచ్చినట్లు బోగట్టా. 

పెద్దగా హడావుడి లేకుండా, వీలయినంత వరకు తక్కువ సిబ్బందితో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటామని టాలీవుడ్ జనాలు కోరగా, ఈ మేరకు మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ తో మాట్లాడి సాయంత్రానికి వీలైతే పోస్ట్ ప్రొడక్షన్ అనుమతులు ఇప్పించే అవకాశం పరిశీలిస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక షూటింగ్ అనుమతులు మాత్రం ఈ లాక్ డౌన్ ముగిసిన తరువాత ఇచ్చేలా తాను ప్రయత్నిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా మెల్ల మెల్లగా వీలయినంత తక్కువ క్రూతో జరిగే సినిమాలు ప్రారంభించాలని, పెద్దగా హడావుడి లేకుండా చూడాల్సి వుంటుందని సమావేశంలో అనుకున్నారు. చిరంజీవితో పాటు ప్రస్తుతం ప్రొడక్షన్ లో వున్న వివిధ సినిమాలకు చెందిన నిర్మాతలు, డైరక్టర్లు, ఇంకా సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మంత్రి తలసాని సమావేశం నుంచి వెళ్లిన తరువాత కూడా కొంత సేపు వీరందరూ మెగాస్టార్ తో కాస్త సమయం కబుర్లు చెబుతూ గడిపారు.

ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..?