Advertisement

Advertisement


Home > Movies - Movie News

'పవర్ స్టార్' టైటిల్ తో వరుణ్

'పవర్ స్టార్' టైటిల్ తో వరుణ్

వాల్మీకి సినిమా తరువాత బాక్సర్ గా పవర్ ఫుల్ సినిమా చేస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. 

కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో నిర్మాతలు సిద్ధు, అల్లు వెంక‌టేశ్ నిర్మించే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ గతంలో బాలు సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరును ఫిక్స్ చేయడం విశేషం.

బాలు సినిమాలో పవన్ క్యారెక్టర్ పేరు 'గని' ఇప్పుడు ఆ టైటిల్ నే వరుణ్ తేజ్ సినిమాకు ఫిక్స్ చేసినట్లు బోగట్టా. 

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై అల్లు వెంకటేశ్, సిద్దు నిర్మిస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. ఇందుకోసం వరుణ్ బాడీ బిల్డ్ చేయడమే కాకుండా కొత్త లుక్ ట్రయ్ చేస్తున్నారు. 

ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది కానీ కరోనా కారణంగా వెనుకబడింది. ఇప్పుడు దాదాపు పూర్తి కావస్తుండడంతో ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను విడుదల చేయబోతున్నారు. 

లోఫర్, వాల్మీకి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ ట్రయ్ చేసిన వరుణ్ మరోసారి అలాంటి మాస్ రోల్ చేయబోతున్నారు. అదే సమయంలో పారలల్ గా ఫుల్ ఫన్ తో ఎఫ్ 3 కూడా చేస్తున్నారు.

బాబు బతికున్నంత వరకు ఎన్టీఆర్ కి భారత రత్న రాదు

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?