పాన్ ఇండియా ఇమేజ్ రావడం ఒకెత్తు అయితే, దానిని ప్రతి సినిమాతోను మీట్ అవడం మరో టాస్కు. ప్రతి సినిమా పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ చేస్తుంటే రెండేళ్లకో సినిమా చేసుకోవాల్సిందే. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభాస్ ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఒకేసారి రెండు సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు.
సాహో, రాధే శ్యామ్ కూడా అలానే చేద్దామని చూసారు కానీ ఆ ప్యారలల్ వ్యవహారం అక్కడ కుదర్లేదు. కానీ తదుపరి చిత్రాలకు ప్రభాస్ పక్కా ప్లాన్‌తో వెళుతున్నాడు. నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలవడానికి రెండేళ్ల సమయం పడుతుంది. ‘ఆది పురుష్’ చిత్రానికి కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ పని ఎక్కువే. ఈ చిత్రాలకు ఆన్ లొకేషన్ టైమ్ కంటే గ్రాఫిక్స్ పరంగా ఎక్కువ సమయం పడుతుంది.
అందుకని ప్రభాస్ ఈ రెండు చిత్రాలకు డేట్స్ ఇచ్చాడు. ముందుగా ఆది పురుష్‌కి ఒక నెల రోజుల పాటు షూటింగ్ చేసి, నాగ్ అశ్విన్ చిత్రానికి రెండు నెలల వర్క్ చేస్తాడు. వాళ్లు గ్రాఫిక్స్ పని ముగించుకునేలోగా మళ్లీ ఆన్ లొకేషన్ షూట్ చేయడానికి వెళతాడు. ఇలా ఈ రెండు చిత్రాల మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా రెండేళ్ల టైమ్‌లో రెండు సినిమాలు వచ్చేలా చూసుకుంటున్నాడు.