ప్రభాస్..విదేశాలకు..లాంగ్ ట్రిప్

బాహుబలి ప్రభాస్ విదేశాలకు పయనమై వెళ్లిపోయారు. మరి మోకాలు కు ఈసారి శస్త్ర చికిత్స చేయించుకుని తిరిగి వస్తారేమో? అన్న వార్తలు వున్నాయి.  Advertisement ఎందుకంటే ఈసారి ట్రిప్ దాదాపు రెండు వారాలు వుంటుందని…

బాహుబలి ప్రభాస్ విదేశాలకు పయనమై వెళ్లిపోయారు. మరి మోకాలు కు ఈసారి శస్త్ర చికిత్స చేయించుకుని తిరిగి వస్తారేమో? అన్న వార్తలు వున్నాయి. 

ఎందుకంటే ఈసారి ట్రిప్ దాదాపు రెండు వారాలు వుంటుందని తెలుస్తోంది. అందువల్ల ఈసారి తన చిరకాల శరీర సమస్య అయిన మోకాలు నొప్పికి సర్జరీ చేయించుకుని తిరిగి వస్తారని తెలుస్తోంది. అయితే ఏదేశంలో, ఏ ఆసుపత్రిలో సర్జరీ అన్నది ప్రస్తుతం కాస్త రహస్యంగానే వుంచినట్లు కనిపిస్తోంది.

విదేశాలకు వెళ్లారని ధృవీకరిస్తున్నారు తప్ప, ఎక్కడికి వెళ్లారు అన్నది ఎవరూ రీవీల్ చేయడం లేదు. సలార్ విడుదల వాయిదా పడింది. ఆ సినిమాకు ప్రస్తుతం ప్రభాస్ చేయాల్సింది ఏమీ లేదు. ప్రాజెక్ట్ కె వర్క్ జరుగుతోంది. అలాగే మారుతి-పీపుల్స్ మీడియా సినిమా కూడా సెట్ మీద వుంది. వెళ్లే ముందు నాలుగు రోజుల పాటు ఓ ఫైట్ సీక్వెన్స్ లో ప్రభాస్ పాల్గొన్నారు. 

ప్రభాస్ వెళ్లాక కూడా హీరో లేని సీన్లు, కొంత ఫైట్ సీన్, కొన్ని హీరోయిన్ సీన్లు నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్నారు.

2024 చివరి వరకు విడుదలయ్యేలా వున్నాయి ప్రభాస్ సినిమాలు. సలార్ విడుదల కావాలి. అది అయిన కనీసం నాలుగైదు నెలలు గ్యాప్ కు కానీ ప్రాజెక్ట్ కె విడుదల వుండదు. ఆ తరువాత సలార్ పార్ట్ 2 వుండనే వుంది. ఇంకా మారుతి సినిమా విడుదల కావాలి. 2025లో స్పిరిట్ సినిమా వుండొచ్చు.