పెద్ద హీరోలు మా ఎన్నికల్లో ఓటు వేయరని, పక్క భాషల హీరోయిన్లు చెన్నయ్, ముంబాయిల్లో వుంటూ ఓటు వేయరని ఇలా రకరకాలుగా లెక్కలు తీసి చెప్పారు. చైతన్య, రామ్ చరణ్ అంటూ కొన్ని పేర్లు కూడా చెప్పారు. బాగానే వుంది. చాలా వరకు నిజం కూడా. పైగా ఆయనకు చనువు వుంది కాబట్టి చాలా వరకు ఏకవచనమే వాడారు. అది కూడా ఓకె.
కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న కామెంట్ ఏమిటంటే అసలు ఎన్నిసార్లు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో ఓటు వేసారు అని? కామెంట్ చేయడమే కాదు, ఇప్పుడు ఆ లెక్క తీసే పనిలో కూడా వున్నారు కొందరు.
కేవలం ఫార్మ్ హవుస్ వుందని తప్పిస్తే ప్రకాష్ రాజ్ బెంగళూరులో ఎక్కువ వుంటారని ఆయన వచ్చి వెళ్లిపోయే హీరోయిన్ల గురించి మాట్లాడుతున్నారని కూడా కామెంట్ చేస్తున్నారు.
'చిరు' తప్పు?
నిజానికి మెగాస్టార్ చిరంజీవి కూడా క్లారిటీ ఇవ్వకుండా తప్పు చేస్తున్నారని కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తన మద్దతు ప్రకాష్ రాజ్ కు వుందా లేదా ? అన్న పాయింట్ గానీ లేదా తను న్యూట్రల్ గా వున్నారా? అన్న విషయం గానీ క్లారిటీగా చెప్పాల్సి వుంది.
అలా కాకుంటే మెగా సపోర్ట్ వుందనే ఫాల్స్ ప్రాపగండా జరిగిపోతోందని కూడా కొందరు మా సభ్యులు వ్యాఖ్యానించారు.
జీవితను పిలిచినట్లే పిలిచి
నటి జీవిత ఎక్కడ నరేష్ వర్గం వైపు వెళ్లిపోతుందో అని ఇటు పిలిచారని, కానీ తీరా ఆమె రాగానే బండ్ల గణేష్ నేరుగా పోటీకి దిగారని, ఈ పరిస్థితిని నివారించకుండా ప్రకాష్ రాజ్ సైలంట్ గా వుండిపోయారని, దీని అర్థం ఏమిటని కొందరు అంటున్నారు.
అంటే జీవిత వల్ల ఓట్లు చీలిపోకుండా చూసుకుని, అలా అని మళ్లీ ఆమె తమ ప్యానల్ లో గెలవకుండా వుండేలా తెరవెనక ప్లాన్ లు వేసారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.