సుశాంత్ సింగ్ మరణం తర్వాత నెపొటిజంపై, ఇండస్ట్రీలో గ్రూపిజంపై ఒక్కొక్కరు మాట్లాడ్డం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు చెప్పిన కామన్ పాయింట్ ఒక్కటే. “ఎస్.. బాలీవుడ్ లో గ్రూపిజం ఉంది.” ఇప్పుడిదే మాట హీరోయిన్ ప్రీతి జింగ్యానీ కూడా చెబుతోంది. తనను ఏకంగా బాలీవుడ్ నుంచి తరిమేయాలని ఓ గ్రూపు ప్రయత్నించిందంటూ ప్రకటించింది ప్రీతి జింగ్యానీ.
“నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావనేది ఇక్కడ ముఖ్యం. ప్రతి రంగంలో గ్రూపిజం ఉంది. నేను కొన్ని మల్టీస్టారర్ సినిమాలు చేశాను. ఆ టైమ్ లో నేను గ్రూపిజం ఎదుర్కొన్నాను. కొన్ని గ్యాంగ్స్ నన్ను బాలీవుడ్ నుంచి బయటకు తోసేయడానికి చూశాయి. సెన్సిటివ్ గా ఉంటే ఇలాంటివన్నీ ప్రభావం చూపిస్తాయి. అయితే నేను మాత్రం వాటిని ఎక్కువగా పట్టించుకోలేదు. కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నా పని నేను చేసుకున్నాను.”
బాలీవుడ్ లో ప్రతి ఒక్కరు షారూక్ ఖాన్ అవ్వలేరంటోంది ప్రీతి. కాబట్టి ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ప్లాన్-బి ఉండాల్సిందేనని గట్టిగా చెబుతోంది. ఇక నెపొటిజంపై స్పందిస్తూ.. నెపోకిడ్స్ కు ఎక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుందని, బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఒకే ఒక్క ఛాన్స్ ఉంటుందని చెప్పుకొచ్చింది.
“బాలీవుడ్ లో వందల మంది స్ట్రగుల్ అవుతుంటారు. ఒక్కరు మాత్రమే షారూక్ ఖాన్ అవుతారు. ఎంతోమంది తమ ఆశల్ని నెరవేర్చుకునేందుకు ముంబయి వస్తుంటారు. అయితే ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎన్నో చీత్కారాలు ఎదురవుతాయి. ఇందులోకి రాకముందే వీటన్నింటిపై అవగాహన ఉండి తీరాలి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాకప్ ప్లాన్ ఉండాలి. అది లేకపోతే కష్టం.”
ఇలా బాలీవుడ్ చీకటి కోణాలపై స్పందించింది ప్రీతి జింగ్యానీ. తెలుగులో తమ్ముడు, నరసింహనాయుడు, అధిపతి లాంటి సినిమాలు చేసిన ప్రీతి.. ఆ వెంటనే బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం ఓటీటీలో తన లక్ చెక్ చేసుకుంటోంది.