Advertisement

Advertisement


Home > Movies - Movie News

పారితోషకం పరిస్థితి మారిందంటున్న ప్రియమణి!

పారితోషకం పరిస్థితి మారిందంటున్న ప్రియమణి!

గతంలో తన బోటి జాతీయ అవార్డులు పొందినవారు కూడా గట్టిగా పారితోషకం అడిగి తీసుకునే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు స్టార్ హీరోయిన్లు ధైర్యంగా తమ పారితోషకాన్ని అడిగే స్థితిలో ఉన్నారని అంటోంది నటి ప్రియమణి. ప్రస్తుతం అనుష్కా షెట్టి, సమంత వంటి వాళ్లు భారీ పారితోషకాన్ని అడిగి మరీ తీసుకుంటున్నారని.. తమకున్న మార్కెట్, తాము నటించే సినిమాలకు ఉన్న మార్కెట్ గురించి వారు అవగాహనతో డబ్బులు తీసుకుంటున్నారని ప్రియమణి అంటోంది.

ఇది ఆహ్వానించదగిన పరిణామం అని ప్రియమణి అభిప్రాయపడింది. హీరోయిన్లు అంటే దిగువ శ్రేణి పనివారులా కాకుండా, తమ స్థాయికి తగ్గట్టుగా డబ్బు తీసుకునే హక్కు ఉన్నవారు కావడం మంచి పరిణామం అని ప్రియమణి అభిప్రాయపడింది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేదని, ఈ మార్పు మంచిదే అని ప్రియమణి చెబుతోంది.

ఇక ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం గురించి కూడా ప్రియమణి స్పందించింది. అది కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహారం కాదని ప్రియమణి వ్యాఖ్యానించింది. అన్ని పరిశ్రమల్లోనూ అలాంటి పరిస్థితి ఉందని, ఉద్యోగం చేసే ఆడవాళ్లను కూడా ఏడిపిస్తున్నారని అభిప్రాయపడింది.

సినీ పరిశ్రమ నుంచి 'మీ టూ' అనే వారికి ఎక్కువ ప్రచారం వస్తోందని ప్రియమణి వ్యాఖ్యానించింది. అదీ ఒకందుకు మంచిదే అని 'మీ టూ' ఉద్యమం వల్ల కొంతమంది అయినా  భయపడుతూ ఉన్నారని, మహిళలపై వేధింపులు తగ్గాయని అంటోంది ఈ నటీమణి.

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?