నటి ప్రియాంక చోప్రా గాయపడింది. ఓ సినిమా షూటింగ్ లో ఆమె ప్రమాదానికి గురైంది. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. తనకు గాయాలైనట్టు స్వయంగా ప్రియాంక చోప్రా వెల్లడించింది.
ఆస్ట్రేలియాలో ది బ్లఫ్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది ప్రియాంక చోప్రా. ఇందులో ఆమెది యాక్షన్ రోల్. ఆమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రియాంక పెదవి చివరి చిన్న గాయమైంది. దీంతో పాటు, ఆమె మెడపై కూడా గాయాలయ్యాయి.
“వృత్తి జీవితంలో ప్రమాదాలు” అనే క్యాప్షన్ తో తనకు తగిలిన దెబ్బల్ని చూపించింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె షూటింగ్ లొకేషన్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిడ్నీ నగరానికి వచ్చింది. అక్కడే విశ్రాంతి తీసుకుంటోంది.
మొన్నటివరకు హెడ్స్ ఆఫ్ స్టేట్స్ అనే చిత్రంలో నటించింది ప్రియాంక చోప్రా. ఆ సినిమా షూటింగ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవాలనుకుంది. కానీ అప్పటికే ది బ్లఫ్ సినిమాకు కాల్షీట్లు కేటాయించడంతో అయిష్టంగానే ఆ సినిమా షూటింగ్ కు హాజరైంది. అంతలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది.