Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్ప - ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్

పుష్ప - ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ సంస్థ నిర్మిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు భాగాల్లో విడుదలవుతోందని ఈ మధ్యనే బయటకు వచ్చింది. ఈ విషయమై నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తో మాట్లాడితే... 

*పుష్ప సినిమాను రెండు భాగాల్లో తీయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. గత నవంబర్ లోనే అనుకున్నాం.

*సినిమా కథ కు అంత స్పాన్ వుంది. అంత భారీతనం వుంది. అంత బడ్జెట్ వుంది.

*దీని వల్ల అదనంగా లాభాలు వచ్చేస్తాయని కాదు. రెండు సినిమాలు రెండు బడ్జెట్ లు, అంతా దేనికదే. 

*మొదటి భాగానిక సంబందించి చాలా వరకు వర్క్ పూర్తయింది. 110  రోజులకు  పైగా షూటింగ్ జరిగింది. బోలెడు ఫుటేజ్ వుంది. భారీ ఫైట్లు, చేజ్ లు, పాటలు, ఐటమ్ సాంగ్ ఒకటేమిటి చాలా.

*పాటల్లో ఒకటిన్నర పాట మాత్రమే ఇంకా తీయాల్సి వుంది.

*రెండు భాగాలు చేయడం వల్ల తొలిభాగంలో ఓ పాట అదనంగా చేరుస్తున్నాం. అదే ఐటమ్ సాంగ్. ఇది ఎవరితో అన్నది ఇంకా డిసైడ్ కాలేదు.

*పుష్ప రెండు పార్ట్ లు వన్ బై వన్ వరుసగా విడుదలవుతాయి. రెండో భాగం మొదటి భాగాన్ని మించి వుంటుంది. ఎందుకంటే మొదటి భాగాన్ని లోకల్ గా రంపచోడవరం లాంటి చోట్ల తీసాం. రెండవది అంతకు మించిన లోకేషన్లలో తీస్తాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?