Advertisement

Advertisement


Home > Movies - Movie News

పుష్పరాజ్ బహుమానాలు

పుష్పరాజ్ బహుమానాలు

పుష్ప సినిమా కోసం బన్నీ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అభిమానులకు మాంచి సినిమాను గిఫ్ట్ గా ఇచ్చే లోగానే బన్నీ మరి కొందరికి బహుమతులు అందించేసాడు. 

పుష్ప సినిమా కు పని చేసిన దర్శకుల విభాగం జ‌నాలకు గోల్డ్ బిస్కెట్ లను బహుమతులుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. రింగ్ నో గొలుసునో ఇస్తే బాగుండదు, అదే గోల్డ్ ఇస్తే వాళ్లకు కావాల్సినట్లు మార్చుకుంటారనే ఆలోచనలో ఇలా చేసినట్లు తెలుస్తోంది.

అలాగే లైటింగ్, కేమేరా విభాగాల్లో దిగువన పని చేసే సిబ్బందికి నగధు బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. బన్నీ ఈ విధంగా చేసారన్న వార్త అభిమానులను ఆనందంలో ముంచుతోంది. సినిమా బాగా వచ్చిన ఆనందంలోనే బన్నీ ఇలా చేసి వుంటారని అంచనాలు వేసుకుంటున్నారు.

మైత్రీ మూవీస్ పతాకంపై 180 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?