బన్నీ-సుకుమార్ కాంబినేషన్ ఫుష్ప సినిమా షూటింగ్ ఏర్పాట్లు షురూ అయ్యాయి. మరో వారం రోజుల్లో ఆంధ్రలోని రంప చోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో పుష్ప సినిమా షూట్ ప్రారంభం అవుతుంది.
అక్కడి 'ఉడ్స్' రిసార్ట్ మొత్తాన్ని యూనిట్ కోసం రిజర్వ్ చేసారు. ఎప్పుడో మార్చిలో ప్రారంభం కావాల్సిన సినిమా. కరోనా కారణంగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ అలాగే ఆగిపోయింది.
కేరళ నుంచి వికారాబాద్ మీదుగా మారేడిమిల్లి వరకు అనేకానేక పేర్లు వినిపించాయి. ఆఖరికి హైదరాబాద్ లో భారీ సెట్ అన్న వార్తలు కూడా వచ్చాయి. ఏమైతేనేం ఆఖరికి షూటింగ్ మొదలవుతోంది.
వచ్చే నెల తొలిరోజుల్లో ప్రారంభమై దాదాపు కాస్త లెంగ్తీ షెడ్యూలునే ఈస్ట్ గోదావరిలో ప్లాన్ చేసారు. అల్లు అర్జున్ ఈ పుష్ఫ సినిమాలో కాస్త డిఫరెంట్ గెటప్ ట్రయ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో లారీ డైవర్ గా కనిపిస్తాడు