cloudfront

Advertisement


Home > Movies - Movie News

పుస్తకమా? జీవితమా?

వ్యవహారిక జ్ఞానం లేని పుస్తక జ్ఞానం వృధా అంటారు. నేటి జనరేషన్ కంప్యూటర్ల వ్యవహారంలో, సాంకేతికంగా ఎంతో ముందు వుంటున్నారు. కానీ మానవ సంబంధాలు, లౌకిక పరిజ్ఞానం విషయంలో వెనుకబడిపోతున్నారు. అనకూడదు కానీ, కందిపప్పు ను పెసరపప్పును పేరు చూసి మాత్రమే గుర్తుపట్టే పరిస్థితిలో వున్నారు. కేవలం వ్యవహారిక జ్ఞానమే కాదు, చదువు, ఉద్యోగాల రంథిలో పడి మానవీయ సంబందాలకు కూడా దూరం అవుతున్నారు.

ఇలాంటి విషయాన్ని తీసుకుని తయారుచేసిన సినిమానే ర్యాంక్ వన్ రాజు. కన్నడంలో పెద్ద హిట్ అయిన సినిమాను తెలుగులోకి పునర్మించారు. నరేష్ కుమార్ దర్శకత్వంలో తయారైన ఈ సినిమాలో చేతన్ హీరోగా నటించాడు. 21న సినిమా విడుదల అవుతున్న సందర్భంగా ట్రయిలర్ విడుదల చేసారు.

రిచ్ లుక్ తో, పెర్ ఫెక్ట్ కాన్సెప్ట్ తో, స్ట్రయిట్ నెరేషన్ తో సినిమాను రూపొందించినట్లు ట్రయిలర్ క్లియర్ గా చూపించింది. డైరక్టర్ వర్క్, కాస్టింగ్ టాలెంట్ బాగానే వున్నాయి. చిన్న సినిమా అయినా కాస్త గట్టిగా ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది. ప్రియదర్శి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, నరేష్ లాంటి ఉద్దండులు నటించిన ఈ సినిమా ట్రయిలర్ చూస్తుంటే స్టూడెంట్స్ కి, వాళ్లను ర్యాంక్ ల కోసం ప్రెషర్ పెట్టే తండ్రులకు డైరక్ట్ గా కనెక్ట్ అయ్యేలా వుంది సినిమా.

ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!