cloudfront

Advertisement


Home > Movies - Movie News

అమీర్ రికార్డును బ్రేక్ చేసిన సల్మాన్

అమీర్ రికార్డును బ్రేక్ చేసిన సల్మాన్

విడుదలకు ముందే అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డును సల్మాన్ ఖాన్ బ్రేక్ చేశాడు. అత్యధిక మొత్తానికి శాటిలైట్ డీల్ కంప్లీట్ చేసుకున్న బాలీవుడ్ సినిమాగా మొన్నటివరకు దంగల్ సినిమా రికార్డుల్లో ఉండేది. ఇప్పుడా రికార్డును రేస్-3 అధిగమించింది.

దంగల్ సినిమాను జీ-గ్రూప్ సంస్థ 120కోట్ల రూపాయలకు (అన్ని భాషలతో కలిపి) దక్కించుకుంది. ఇండియాలో అత్యధిక మొత్తానికి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన సినిమా ఇదే. ఈ మూవీ తర్వాత అత్యధిక మొత్తానికి శాటిరైట్స్ రైట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా 2.0 నిలిచింది. ఇప్పుడీ రెండు సినిమాల్ని రేస్-3 క్రాస్ చేసింది. 

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. రేస్-3 శాటిలైట్ రైట్స్ ఏకంగా 130కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇంకా చెప్పాలంటే.. సినిమా బడ్జెట్ లో 90శాతం శాటిలైట్ రైట్స్ డీల్ రూపంలో వచ్చేసింది. ఇక థియేట్రికల్ రూపంలో వచ్చేదంతా లాభం కిందే లెక్క.

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనీల్ కపూర్, బాబి డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది రేస్-3.