రాధేశ్యామ్ కేరాఫ్ ప్రభాస్!

రాధేశ్యామ్ సినిమా 2022 సంక్రాంతికి విడుదల. కానీ సినిమా నుంచి ఏ అప్ డేట్స్ రావడం లేదని ఫ్యాన్స్ విలవిల. ఏమిటిదంతా అని విచారిస్తే చిత్రమైన విషయాలు తెలుస్తున్నాయి.  Advertisement ప్రస్తుతం రాధేశ్యామ్ వ్యవహారాలు…

రాధేశ్యామ్ సినిమా 2022 సంక్రాంతికి విడుదల. కానీ సినిమా నుంచి ఏ అప్ డేట్స్ రావడం లేదని ఫ్యాన్స్ విలవిల. ఏమిటిదంతా అని విచారిస్తే చిత్రమైన విషయాలు తెలుస్తున్నాయి. 

ప్రస్తుతం రాధేశ్యామ్ వ్యవహారాలు అన్నీ హీరో ప్రభాస్ తన కంట్రోల్ లోకి తీసుకున్నారట. ఓ పోస్టర్ వదలాలి అన్నా, ఓ పిక్ రిలీజ్ చేయాలి అన్నా, పాట విడుదల చేయాలి అన్నా ప్రభాస్ నే చేయాలంట..

ప్రభాస్ సినిమాల పబ్లిసిటీ చూసే బాలీవుడ్ టీమ్ నే ఈ వ్యవహారాలు అన్నీ పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో నెలరోజులు ముందుగా పబ్లిసిటీ స్టార్ట్ చేయడం అలవాటు అంట. అందుకే రాధేశ్యామ్ ప్రచారం కూడా ఆలస్యం అవుతోందని బోగట్టా.

అంతే కాదు, రాధేశ్యామ్ ఎడిటింగ్, క్వాలిటీ కంట్రోలు అన్నీ కూడా ప్రభాస్ తన చేతుల్లోకి తీసుకున్నారని తెలుస్తోంది. కేవలం సినిమా మార్కెటింగ్ మాత్రమే యువి క్రియేషన్స్ సంస్థకు వదిలి పెట్టారని బోగట్టా. ఎడిటింగ్ వ్యవహారాలు సైతం ప్రభాస్ పర్యవేక్షిస్తున్నట్లు టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలొ వినిపిస్తోంది.