cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

అషూను ఏడ్పించిన బిగ్‌బాస్ విన్న‌ర్ రాహుల్‌

అషూను ఏడ్పించిన బిగ్‌బాస్ విన్న‌ర్ రాహుల్‌

అషూరెడ్డి... ప‌వ‌న్‌క‌ల్యాణ్ వీరాభిమానిగా హాట్ కామెంట్స్‌తో త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ ఉంటారు. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఇష్ట‌మైతే నాలుగో భార్య‌గా ఉండ‌డానికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించి, ఆ త‌ర్వాత భారీ ట్రోల్స్‌కు గురైన సంగ‌తి తెలిసిందే. 

తాజాగా మ‌రోసారి ఆమె సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మయ్యారు. త‌న‌ను బిగ్‌బాస్ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌ ఏడ్పించాడ‌ని అదే రియాల్టీ షో ఫేం అయిన అషూరెడ్డి రాసుకొచ్చారు. ఇంత‌కీ అషూరెడ్డి ఏడ్పు సంగ‌తేంటో తెలుసుకుందాం.

బిగ్‌బాస్ హౌజ్‌లో రాహుల్ - 'ఉయ్యాల జంపాల' ఫేమ్‌ పునర్నవి భూపాలం మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డిచింది. హౌజ్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. కానీ ఊహించ‌ని విధంగా హౌజ్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత అషూరెడ్డితో రాహుల్‌కు సాన్నిహిత్యం పెరిగింది. 

ఆ మ‌ధ్య అషూను ఎత్తుకుని గాలిలో తిప్పుతూ రాహుల్ దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ అంటూ సోష‌ల్ మీడియాలో విస్తృత చ‌ర్చ జ‌రిగింది.

తాజాగా మ‌రోసారి వాళ్లిద్ద‌రి మ‌ధ్య రిలేషన్‌షిప్‌పై చ‌ర్చ‌కు తెర‌తీశారు. ఓ ఇంట‌ర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ అషూరెడ్డి త‌న‌కెలా ప్ర‌త్యేక‌మో చెప్పుకొచ్చాడు. అషూ చూపే కేరింగ్ త‌న‌కెంతో ఇష్ట‌మ‌న్నాడు. అందుకే అషూ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని తేల్చి చెప్పాడు. ఒక సంద‌ర్భంలో ఎంతో అవ‌స‌ర‌మై రూ.10 వేలు అడిగితే, అషూ ఒక్క క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా పంపింద‌ని చెప్పుకొచ్చాడు.

ఇదే మ‌రొక‌రి ద‌గ్గ‌రైతే ఇలా నిర్మొహమాటంగా అడగలేనని చెప్పుకొచ్చాడు. ఇక్క‌డే అస‌లు ట్విస్టు. ఈ ఇంటర్వ్యూ చూసిన అషూ చాలా భావోద్వేగానికి లోన‌య్యారు. "థ్యాంక్యూ రాహుల్‌.. నాకు ఏడుపొస్తోంది. నువ్వు ఎప్పటికీ ఎంతో స్పెషల్‌".. అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారామె. దీంతో అషూను రాహుల్ ఏడ్పించాడంటూ నెటిజ‌న్లు స‌ర‌దా కామెంట్స్ పెట్ట‌డం గ‌మ‌నార్హం.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×