Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాహుల్- శ్రీముఖి..న్యూ రిలేషన్ షిప్!

రాహుల్-  శ్రీముఖి..న్యూ రిలేషన్ షిప్!

బిగ్ బాస్ –3 హౌస్ లో వివాదాలతో వార్తల్లోకి ఎక్కారు యాంకర్ శ్రీముఖి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్. వీరిద్దరూ ఆఖరి వరకూ హౌస్ లో కొనసాగారు. రాహుల్ విజేతగా నిలవగా, శ్రీముఖి రన్నరప్ అయ్యింది. రాహుల్ విజయాన్ని తను గుర్తించను అన్నట్టుగా కూడా మాట్లాడింది శ్రీముఖి.  బిగ్ బాస్ ముగిసిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా రాహుల మీద అసహనాన్ని చాటింది ఈ టీవీ యాంకర్.

అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ తమ మధ్యన విబేధాలు లేవని ప్రకటించుకున్నారు. అందుకు సూచనగా జాయింట్ సెల్ఫీని పోస్టు చేశారు. తమ అధికారిక ఇన్ స్టా అకౌంట్లలో వీరు ఆ ఫోటోను పోస్టు చేశారు.

'గతం గతః.. అసలు రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది..' అంటూ శ్రీముఖి ఈ ఫొటోతో పాటు పోస్టు చేసింది. ఈ విధంగా వీరు తాము ఫ్రెండ్స్ అయిన వైనాన్ని వివరించారు. బిగ్ బాస్ త్రీ తో వీరి గుర్తింపు రెట్టింపు అయ్యింది. ప్రత్యేకించి రాహుల్ గతంలో పాడిన పాటలు కూడా ఇప్పుడు మళ్లీ ఊపు మీదకు వచ్చాయి. 'ఇతడి పాటలు ఇన్నాళ్లూ విన్నాం.. కానీ అప్పుడు ఇతడెవరో తెలీదు, ఆ సూపర్ హిట్ పాటలను పాడింది ఇతడేనా..' అంటూ అనేక మంది రాహుల్ ను ఇప్పుడు గుర్తిస్తున్నారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?