Advertisement

Advertisement


Home > Movies - Movie News

రెయిడ్ రీమేక్ కు రంగం రెడీ

రెయిడ్ రీమేక్ కు రంగం రెడీ

చకచకా సినిమాలు చేసే సీనియర్ హీరోల్లో రవితేజ ముందు వుంటారు. సినిమా మీద సినిమా గ్యాప్ లేకుండా చేస్తుంటారు. ఈగిల్ సినిమా విడుదలకు రెడీగా వుంది. మరో సినిమాకు పచ్చ జెండా ఊపేసారు. 

నిజానికి మైత్రీ తో, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా చేయాల్సి వుంది. కానీ నూట ఇరవై కోట్ల బడ్జెట్ అని లెక్కలు వేసుకుని, నిర్మాతలు వెనక్కు తగ్గారని వార్తలు వచ్చాయి. ఆ స్లాట్ ను పీపుల్స్ మీడియా అందుకుంది.

ఇప్పటికే ధమాకా, ఈగిల్ సినిమాలను ఇదే సంస్థ రవితేజ తో నిర్మించింది. ఇది మూడో సినిమా. హిందీలో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ ఇది. మరీ ఎక్కువ బడ్జెట్ అవసరం పడే సినిమా కాదు. హీరో-దర్శకుడు రెమ్యూనిరేషన్లు కలిపి నలభై కోట్లు అయితే, నిర్మాణానికి మరో నలభై అయిదు కోట్లు అవుతుంది. అందువల్ల లాభసాటి ప్రాజెక్టు అవుతుందని లెక్కలు కట్టేసారు. ఈ సినిమాను ఈ నెలలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నెలలో ప్రారంభించి ఓ పెద్ద షెడ్యూలును ఉత్తరప్రదేశ్ లోని ఓ ఇంట్లో చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. వన్స్ హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే, సెట్ మీదకు వెళ్లిపోతుంది. ఇదిలా వుంటే అనిల్ రావిపూడి-దిల్ రాజు కూడా రవితేజతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?