Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాజమౌళి మనసులో ఏముందో?

రాజమౌళి మనసులో ఏముందో?

టాలీవుడ్ లో పెద్ద సినిమాల ప్లాన్ చేసుకున్న వారంతా ఇది తెలియకే కిందా మీదా అయిపోతున్నారు. అనేక పెద్ద సినిమాలు సెట్ మీద వున్నాయి. ప్లానింగ్ లో వున్నాయి. కానీ విడుదల డేట్ అన్నది ఫిక్స్ చేసుకోవాలంటే అసలు ఏయే సినిమాలు వస్తున్నాయో తెలియాలి. 

ముఖ్యంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సంగతేమిటో తెలియాలి. అనుకున్న డేట్ కు వచ్చే అవకాశం లేదు అన్నది క్లారిటీగా తెలిసిపోతోంది. ఎందుకంటే కరోనా రెండో వేవ్ వల్ల దాదాపు నెలా రెండు నెలలు వేస్ట్ అయిపోయాయి.

మరి ఆ తరువాత డేట్ ఏమిటి? ఇది హీరోలకూ తెలియదు. నిర్మాత దానయ్యకూ తెలియదు. అసలు సినిమా కర్త కర్మ క్రియ అని రాజమౌళికి అయినా తెలుసా అని ఓ అనుమానం. 

ఎందుకంటే ఈ సిట్యువేషన్ ఎప్పుడు మళ్లీ మారి అన్నీ యధాతథంగా వుంటాయో తెలియదు. పైగా సినిమాలో నటిస్తున్నవారు ఎందరు రెడీగా వున్నారో తెలియదు.

హీరో ఎన్టీఆర్ కు కరోనా సోకింది. అంటే కనీసం ఓ నెల రోజులు ఆయన అందుబాటులో వుండరు. ఇవన్నీ చూస్తుంటే ఇక ఆర్ఆర్ఆర్ సమ్మర్ కు వెళ్లిపోతుందని క్లారిటీ వచ్చేస్తోంది. కానీ ఒక్కటే సమస్య అధికారికంగా చెబితే మిగిలిన సినిమా జనాలు తమ తమ సినిమాలను సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?