cloudfront

Advertisement


Home > Movies - Movie News

రెస్పాన్స్ రాలేదు, అందుకే మహేష్ ను తీసుకోలేదు

రెస్పాన్స్ రాలేదు, అందుకే మహేష్ ను తీసుకోలేదు

ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా పెట్టి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ మల్టీస్టారర్ తీస్తున్నాడు రాజమౌళి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇంత పెద్ద మల్టీస్టారర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ను మాత్రమే ఎందుకు తీసుకున్నాడు. ఇండస్ట్రీలో ఇంకా చాలామంది స్టార్స్ ఉన్నారు కదా. వాళ్లలో ఎవరి పేర్లయినా పరిశీలించాడా? ఎవర్నయినా సంప్రదించాడా?

ఇదే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. మరీ ముఖ్యంగా మహేష్ బాబుతో సినిమా చేస్తానంటూ ప్రకటించిన రాజమౌళి, అతడ్ని ఎందుకు లెక్కలోకి తీసుకోలేదంటూ మీడియా ప్రశ్నించింది. దీనికి గమ్మత్తయిన సమాధానం ఇచ్చాడు రాజమౌళి. జనాల నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లనే మహేష్ ను తీసుకోలేదని అంటున్నాడు.

"గతంలో ఓ కార్యక్రమంలో మహేష్ తో సినిమా చేస్తానన్నాను. మహేష్ ను అల్లూరి సీతారామరాజుగా చూడాలనుకుంటున్నారా అని ఆ సభలో ప్రేక్షకుల్ని అడిగాను. కానీ పెద్దగా స్పందన రాలేదు. అందుకే ఆర్-ఆర్-ఆర్ లో మహేష్ ను తీసుకోలేదు." ఇది రాజమౌళి రియాక్షన్.

అల్లూరి సీతారామరాజు అనగానే ఎవరికైనా సూపర్ స్టార్ కృష్ణ గుర్తొస్తారు. అలాంటి పాత్రను మళ్లీ చేస్తే మహేష్ మాత్రమే చేయాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు అదే పాత్రతో ఆర్-ఆర్-ఆర్ సినిమాను చేస్తూ, మహేష్ ను కాకుండా రామ్ చరణ్ ను అల్లూరిగా ఎంపిక చేశాడు రాజమౌళి.

ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అల్లూరి గెటప్ లో మహేష్ బాగోడంటూ కొందరు అంటుంటే, రాజమౌళి కావాలనే మహేష్ ను పక్కనపెట్టాడని మరికొందరంటున్నారు. చర్చ ఎలా ఉన్నప్పటికీ, ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టును మహేష్ మిస్ అయ్యాడనేది మాత్రం వాస్తవం. 

చంద్రబాబు చేసిందే నేను చూపిస్తున్నా.. వర్మ

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!