cloudfront

Advertisement


Home > Movies - Movie News

రాజశేఖర్ కూడా అమ్మాయిల పిచ్చోడే

రాజశేఖర్ కూడా అమ్మాయిల పిచ్చోడే

కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ లో వాడివేడి చర్చ జరుగుతున్న ఈ తరుణంలో రోజుకో సెలబ్రిటీ పేరు తెరపైకొస్తోంది. ఇందులో భాగంగా నటుడు రాజశేఖర్ పేరు కూడా చర్చకొచ్చింది. స్వయంగా పీవోడబ్ల్యూ సంథ్య ఈ హీరోపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ టీవీ డిస్కషన్ లో పాల్గొన్న సంథ్య.. స్వయంగా జీవితానే రాజశేఖర్ కు అమ్మాయిల్ని సప్లయి చేసేవారని ఆరోపించారు.

నిజానికి రాజశేఖర్ పై ఈ తరహా ఆరోపణలు ఇప్పటివి కావు. దాదాపు పదేళ్లుగా ఈ నటుడిపై ఇలాంటి పుకార్లు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటికి ఎక్కడా రుజువుల్లేవ్. అయితే ఈసారి స్వయంగా పీవోడబ్ల్యూ సంథ్య ఈ ఆరోపణలు చేయడం కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇండస్ట్రీ బాధితులతో వరుసగా చర్చలు జరుపుతున్న సంథ్య, కీలకమైన ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్న పేద అమ్మాయిల్ని జీవిత ట్రాప్ చేసి, వాళ్లను రాజశేఖర్ వద్దకు పంపించేవారని.. రాజశేఖర్ వద్దకు వెళ్లకపోతే బెదిరించేవారని సంథ్య ఆరోపిస్తున్నారు.

"గతంలో అమీర్ పేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటున్న అమ్మాయిని జీవిత ఇలానే ట్రాప్ చేశారు. జ్వరంగా ఉంది రాలేనని ఆ అమ్మాయి చెబితే బండ బూతులు తిట్టారు. నువ్వు రాకపోతే నా భర్తను ఎవరు సుఖపెడతారని తిట్టారు. అప్పట్లో ఈ వ్యవహారంపై ఓ పత్రికలో కథనం కూడా వచ్చింది." ఇలా రాజశేఖర్-జీవితపై ఆరోపణలు చేశారు సంధ్య.

ఉన్నఫలంగా సంధ్య ఈ ఆరోపణలు చేయడానికి ఆ కారణం ఉంది. ఇండస్ట్రీలో మహిళా వేధింపుల నిరోధానికి సంబంధించి ఏర్పాటుచేసిన క్యాష్ కమిటీలో జీవితను సభ్యురాలిగా చేర్చడాన్ని సంధ్య తప్పుబట్టారు. భర్తకు అమ్మాయిల్ని సరఫరా చేసే జీవితతో కమిటీ ఏర్పాటుచేస్తే, బాధితులకు ఇక న్యాయం ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.