విషాదం.. రాకేష్ మాస్టర్ మృతి!

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. విజయనగరం నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండ‌గా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించిన‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా…

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. విజయనగరం నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండ‌గా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించిన‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రాకేశ్ మాస్టర్ మరణవార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.

1968లో తిరుపతిలో జన్మించారు రాకేష్ మాస్టార్. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆట డ్యాన్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయ‌న‌.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.  సినిమాలకు దూరంగా ఉండి గ‌త కొంత కాలంగా యూట్యూబ్ ఇంటర్వ్యూలతో హల్‌చల్ చేస్తున్నారు. సొంతంగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ పెట్టుకొని.. చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ తన కెరీర్‌ను నాశనం చేశారంటూ ఆరోపణలు చేసి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యారు.   

లాక్ డౌన్ టైంలో రాకేశ్ మాస్ట‌ర్ చేసిన వీడియోలు పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరూ రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం.