Advertisement

Advertisement


Home > Movies - Movie News

రకుల్ డ్రగ్స్ సేవించలేదట.. కేవలం దాచిపెట్టిందట

రకుల్ డ్రగ్స్ సేవించలేదట.. కేవలం దాచిపెట్టిందట

అవును.. హీరోయిన్ రకుల్ ప్రీత్ ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదట. కాకపోతే ఆమె అలాంటి మాదకద్రవ్యాల్ని తన ఇంటిలో దాచిపెట్టిందట. ఈరోజు విచారణలో ఎన్సీబీ అధికారుల ముందు రకుల్ చెప్పిన మాట ఇది. ఈ మేరకు ఇండియాటుడే ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సమన్లు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఈరోజు ముంబయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ముందు హాజరైంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి రకుల్ ను 3 గంటల పాటు విచారించారు అధికారులు. ఈ క్రమంలో ఆమె నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది.

సదరు ఛానెల్ చెబుతున్న దానిప్రకారం.. రియాతో డ్రగ్స్ గురించి మాట్లాడినట్టు రకుల్ అంగీకరించిందట. ఈ విచారణ కంటే ముందు ముంబయిలోని రకుల్ ఫ్లాట్ లో జరిపిన సోదాల్లో మాదకద్రవ్యాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారట. అయితే ఆ డ్రగ్స్ తనవి కావని, రియా కోరిన మీదట తన ఫ్లాట్ లో ఉంచినట్టు రకుల్ అంగీకరించిందట.

ఇప్పటికే తనను టీటోట్లర్ (ఆల్కహాల్ సేవించని వ్యక్తి)గా చెప్పుకున్న రకుల్ ప్రీత్.. తనకు ఏ ఒక్క డ్రగ్ డీలర్ తెలియదని అంటోంది. ఇండియాటుడే కథనం ప్రకారం చూసుకుంటే.. సేవించకపోయినప్పటికీ, ఇంట్లో డ్రగ్స్ ఉంచడం కూడా చట్టరీత్యా నేరం. 

పవన్ ఇంటర్వ్యూ.. పరస్పర సహకార ఒప్పందం

కొరటాల కథ కొట్టేసింది బోయపాటేనా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?