‘నువ్వు మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా…దాన్ని అత్తింటికి తీసుకుపోరా మల్లేశా’… ఓ ఎంటర్ టైన్ మెంట్ సాంగ్ కు ఇంత కన్నా క్యాచీ పదాలు ఏముంటాయి? గేయ రచయిత రామ్ జోగయ్య రాసిన గీతం ఇది. మోడరన్ రాముడు అంటే ఎలా వుంటాడు.. బుద్దిగా ఆఫీసు.. ఇల్లు.. ల్యాప్ టాప్. అంటూ ఇదే పాటలో రాసుకువచ్చారు ఆయన. ఇదంతా ధూమ్ ధామ్ అనే సినిమా కోసం.
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. సీనియర్ రైటర్ గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “ధూం ధాం” సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘మల్లెపూల టాక్సీ..’ రిలీజ్ చేశారు. గోపీ సుందర్ క్యాచీ బీట్ తో కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ గా పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. పెళ్లి నేపథ్యంగా ఈ పాటను కలర్ పుల్ గా పిక్చరైజ్ చేశారు.
‘నూటొక్క జిల్లాల అందగాడే మా ఇంటి పిల్లకు నచ్చినాడే… ఎన్నెల్లో ముంచిన చందురుడే మా పిల్ల కోసమే పుట్టినాడే.. బుగ్గ చుక్క పెట్టుకున్న అందాల చందాల బంతిరెక్క ఎరికోరి సరైనోడినే ఎంచుకున్నాదే ఎంచక్కా.. పెండ్లి పిల్ల, పిల్లగాడి జోడి అదిరెనే… ఈ ఇద్దరి జంట చూసినోళ్ల కళ్లు చెదిరెనే.. నువ్వు మల్లెపూల టాక్సీ తేరే మల్లేశా..పిల్లదాన్ని అత్తింటికి తీసుకపోరా మల్లేశా..’ అంటూ సాగుతుందీ పాట.