Advertisement


Home > Movies - Movie News
రామ్-ప్రవీణ్ సత్తారు సినిమాకు శ్రీకారం

గరుడవేగ సినిమాతో పెద్ద హీరోలను ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఇప్పుడు తన తరువాత ప్రాజెక్టును హీరో రామ్ తో స్టార్ట్ చేస్తున్నాడు. రామ్ హోమ్ బ్యానర్ స్రవంతి మూవీస్ నిర్మించే ఈసినిమాకు ఈరోజు లాంఛనంగా పూజ చేసారు. వచ్చే నెల 6నుంచి రెగ్యులర్ షూటింగ్ వుంటుంది. మాళవిక శర్మను హీరోయిన్ గా తీసుకునే అవకాశం వుంది.

ప్రవీణ్ సత్తారుతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు ఆఫర్లు ఇచ్చారు. కానీ ప్రస్తుతం ప్రవీణ్ అనుకున్న కథకు రామ్ పక్కాగా సూట్ అవుతాడని ఫీల్ అవ్వడంతో, అతనితో ముందుకు వెళ్తున్నాడు. ప్రవీణ్ సత్తారు మరో సినిమాను కూడా మరో హీరో తో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ ఓసినిమాను నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్నాడు. అది చాలా వరకు పూర్తయింది. హలో గురూ ప్రేమ కోసమే.. అనే టైటిల్ ను దీనికి ఫిక్స్ చేసారు.