Advertisement

Advertisement


Home > Movies - Movie News

వెయ్యి కోట్లు దాటిన టాలీవుడ్ హీరో ఆస్తి

వెయ్యి కోట్లు దాటిన టాలీవుడ్ హీరో ఆస్తి

ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. భారీగా పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ అయి ఉంటాడని భావిస్తారు. కోలీవుడ్ నుంచి రజనీకాంత్ లేదా టాలీవుడ్ నుంచి మహేష్ బాబు ఉండొచ్చని అనుకుంటారు. కానీ సౌత్ లో బాగా డబ్బున్న హీరో రామ్ చరణ్.

రామ్ చరణ్ నికర ఆస్తి విలువ 1370 కోట్ల రూపాయలు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇదే నిజం. వేల కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడు చరణ్. కేవలం సినిమాల నుంచి మాత్రమే ఇతడికి ఇంత ఆస్తి రాలేదు. తెలివిగా పెట్టుబడులు పెట్టడంతో పాటు, యాడ్స్ చేయడం వల్ల చరణ్ ఈ స్థాయికి ఎదిగాడు.

రామ్ చరణ్ తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు అతడు 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం కూడా అతడు దాదాపు ఇంతే మొత్తాన్ని ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం మాత్రం చరణ్ ఇంకాస్త భారీగా పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇలా సినిమాలతో పాటు చరణ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఓ విమానయాన సంస్థలో అతడికి పెట్టుబడులున్నాయి. దీనికితోడు కొణెదల ప్రొడక్షన్ కంపెనీకి స్థాపించి, దానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వీటితో పాటు మరికొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నాడు.

మరోవైపు యాడ్స్ లో కూడా దూసుకుపోతున్నాడు చరణ్. ఇతడి చేతిలో మీషో, సువర్ణభూమి, హీరో, మాన్యవర్, ఫ్రూటీ లాంటి ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి.

ఇలా రెండు చేతుల సంపాదిస్తున్నాడు కాబట్టే, వెయ్యి కోట్ల రూపాయలకు అధిపతిగా అవతరించాడు చరణ్. ప్రస్తుతం దేశంలో అత్యథికంగా ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీల్లో రామ్ చరణ్ కూడా ఒకడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?