cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ పచ్చబొట్టు చెరిగిపోవట్లేదు - రానా

ఆ పచ్చబొట్టు చెరిగిపోవట్లేదు - రానా

టాటూస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. హీరోలైనా, హీరోయిన్లైనా రకరకాల టాటూస్ వేయించుకోవడానికి ఇష్టపడుతుంటారు. కొందరు తాత్కాలికంగా నిలిచి ఉండే టాటూస్ వేయించుకుంటే, మరికొంత మంది మాత్రం శాశ్వతంగా నిలిచిపోయేలా పచ్చబొట్లు వేయించుకుంటారు. నాగార్జున భుజంపై ఉన్న పచ్చ బొట్టు అలాంటిదే. అది చెరిగిపోదు.

సరిగ్గా ఇలాంటి ఓ పచ్చ బొట్టే రానా ఒంటిపై కూడా ఉంది. కాకపోతే అది ఎక్కడుంది. ఆ పచ్చ బొట్టులో ఏముంది అనే విషయాల్ని మాత్రం రానా చెప్పడం లేదు. కానీ ఆ పచ్చ బొట్టు చెరిగిపోతే బాగుణ్ను అనే అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తంచేశాడు.

"ఓ పచ్చబొట్టు వేయించుకోవాల్సి వస్తే ఎవరి పేరును టాటూగా వేయించుకుంటావ్" అనే ప్రశ్న రానాకు ఎదురైంది. దీనికి సమాధానంగా స్పందించిన రానా.. ఎవరి పేరు వేయించుకుంటాననే విషయాన్ని పక్కనపెడితే.. ముందుగా తన ఒంటిపై ఉన్న ఓ టాటూ డిజైన్ ను మాత్రం మార్చుకోవాలని ఉందని, అది తనను ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చాడు.

ఇక ఎవరి పేరును టాటూగా వేయించుకోవాలనే ప్రశ్నకు స్పందిస్తూ.. తన పేరునే పచ్చబొట్టుగా పొడిపించుకుంటానని, దాని వల్ల ఎవరికి ఎలాంటి సమస్యలు రావని అన్నాడు. 

పైగా తన పేరులో తాత పేరు కూడా ఉంది కాబట్టి, తన పేరునే పచ్చబొట్టుగా పెట్టుకుంటానన్నాడు. అయితే ఆల్రెడీ తన ఒంటిపై ఇబ్బంది పెడుతున్న ఓ టాటూలో ఏముందనే విషయాన్ని మాత్రం దాటేశాడు.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×