ఆరోజు రానే వచ్చింది రానా

రానా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అవును.. ఈరోజే రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దీనికి సంబంధించి రామానాయుడు స్టుడియోస్ ను అందంగా అలంకరించారు. స్టుడియోలో పెళ్లి కోసం స్వర్గాన్ని తలపించే ఖరీదైన సెట్…

రానా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అవును.. ఈరోజే రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దీనికి సంబంధించి రామానాయుడు స్టుడియోస్ ను అందంగా అలంకరించారు. స్టుడియోలో పెళ్లి కోసం స్వర్గాన్ని తలపించే ఖరీదైన సెట్ వేశారు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ మిహీకా మెడలో మరికొన్ని గంటల్లో రానా మూడు ముళ్లు వేయబోతున్నాడు.

పెళ్లికి సంబంధించి 3 రోజుల కిందటే సంబరాలు మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, సంగీత్.. ఇలా రకరకాలుగా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లిలో తుదిఘట్టంలోకి ఎంటరయ్యారు. ఈరోజు తెలుగు సంప్రదాయంలో రానా-మిహీకా పెళ్లి జరుగుతుంది.

తన పెళ్లికి సంబంధించి రానా పెద్దగా ఫొటోలు విడుదల చేయడం లేదు. కానీ మిహీకా మాత్రం ఎప్పటికప్పుడు తన స్టిల్స్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది. అటు దగ్గుబాటి కాంపౌండ్ కూడా ఏరోజుకారోజు కొన్ని స్టిల్స్ ను విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తోంది.

కరోనా వల్ల ఈ పెళ్లిని చాలా తక్కువ మంది అతిథులు మధ్య జరుపుతున్నారు. అటుఇటుగా కేవలం 30-40 మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారని అంటున్నారు. స్టుడియోలో ఎంటరైన దగ్గర్నుంచి, పెళ్లి మంటపం వరకు అడుగడుగునా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కరోనా పరిస్థితులన్నీ తగ్గుముఖం పట్టిన తర్వాత రానా-మిహీకా కలిసి ఇండస్ట్రీకి పెద్ద పార్టీ ఇవ్వబోతున్నారు.

మిహీకాది బజాజ్ కుటుంబం. వీళ్లకు ముంబయి, హైదరాబాద్ లో వజ్రాల వ్యాపారాలు, నగల షాపులు ఉన్నాయి. మిహీకా ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ చేసింది. ప్రస్తుతం డ్యూ డ్రాప్ పేరిట ఇంటీరియర్ అండ్ ఈవెంట్ బిజినెస్ చేస్తోంది. అటు రానా పెళ్లి తర్వాత కూడా మరికొన్నాళ్లు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడు చేయాల్సిన హిరణ్యకశిప ప్రాజెక్టు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

నిమ్మగడ్డకి పదవొచ్చింది పని లేదు