cloudfront

Advertisement


Home > Movies - Movie News

మీకు తెలుసా.. ఆ రెండు సినిమాలు ఆగిపోయాయి!

మీకు తెలుసా.. ఆ రెండు సినిమాలు ఆగిపోయాయి!

సినిమాలు ఆగిపోవడం హీరోల కెరీర్ లో కొత్త కాదు. చిరంజీవితో ప్రారంభిస్తే కుర్ర హీరో రాజ్ తరుణ్ వరకు చాలామంది హీరోల కెరీర్స్ లో సినిమాలు ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో ఇద్దరు హీరోలు చేరారు. వాళ్లే నారా రోహిత్, రానా.

శబ్దం.. నారా రోహిత్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చిత్రం. గతేడాది ఉగాది సందర్భంగా అమరావతిలో ఈ సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేశారు. పలువురు టీడీపీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అదే రోజున టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ పై రావాల్సిన ఈ సినిమా ఇక రాదు. సినిమా దాదాపు ఆగిపోయినట్టే.

నివేత థామస్ హీరోయిన్ గా ఎంపికైన ఈ సినిమాలో నారా రోహిత్ మూగవాడిగా నటించనున్నాడు. మౌనమే అతడి ఆయుధం అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. కానీ యూనిట్ తో నారా రోహిత్ కు అభిప్రాయ బేధాలు రావడం వల్ల సినిమా ఆగిపోయిందంటున్నారు.

శబ్దం సినిమా ప్రారంభమై ఆగిపోతే, టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రావాల్సిన ఈ సినిమా దాదాపు అటకెక్కినట్టే అని టాక్. ఈ సినిమా స్థానంలో హిరణ్యకశిప చిత్రాన్ని తీసుకురాబోతున్నాడు రానా. టైగర్ నాగేశ్వరరావు ఎందుకు ఆగిపోయిందనే విషయంపై క్లారిటీలేదు.

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?