తన అనారోగ్యాన్ని పూర్తిగా బయటపెట్టిన రానా

రానా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడనే విషయం అందరికీ తెలుసు. అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకున్నాడనే విషయం కూడా తెలుసు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కోలుకున్నాడు కూడా. అయితే స్పష్టంగా రానా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య…

రానా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడనే విషయం అందరికీ తెలుసు. అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకున్నాడనే విషయం కూడా తెలుసు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కోలుకున్నాడు కూడా. అయితే స్పష్టంగా రానా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య ఏంటనేది మాత్రం చాలామందికి తెలియదు. అప్పట్లో తనకు ఏం జరిగిందో స్వయంగా రానా బయటపెట్టాడు.

''అరణ్య'' షూటింగ్ కోసం రానా రెడీ అవుతున్న రోజులవి. లుక్ లో భాగంగా కళ్లకు చిన్న లేజర్ ట్రీట్ మెంట్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఫార్మాలిటీ ఛెకింగ్ లో భాగంగా టెస్టులు చేస్తే హై-బీపీ ఉన్నట్టు తేలింది. అది కూడా చాలా అసాధారణమైన స్థాయిలో ఉంది. రెగ్యులర్ గా 120/80 ఉండాలి. కానీ రానాకు మాత్రం 240/120 ఉందట.

దాంతో వైద్యుల సూచనల మేరకు రాత్రికి రాత్రి రానా, సురేష్ బాబు అమెరికా వెళ్లిపోయారు. అక్కడ మరొక్కసారి పరీక్షలు చేసి వైద్యులు తేల్చిందేంటంటే.. రానా పుట్టుక నుంచే హై-బీపీతో ఉన్నాడట. అది ఇంకాస్త ఎక్కువైందట. 

దీని ఫలితంగా గుండె దెబ్బతిందని, మరో 6 నెలలు లేదా ఏడాదిలో శరీరంలో మరికొన్ని అవయవాలు కూడా డ్యామేజ్ అవుతాయని వైద్యులు చెప్పారట. దీంతో టెస్టుల కోసం వెళ్లిన రానా, ట్రీట్ మెంట్ పూర్తయ్యేవరకు అమెరికాలోనే ఉండిపోయాడు.

ప్రపంచంలోనే ది బెస్ట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నానని తెలిపిన రానా..  ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నానని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పుకొచ్చాడు. 'ఆహా' ఓటీటీ కోసం సమంత చేస్తున్న ఇంటర్వ్యూల్లో భాగంగా ప్రత్యేక అతిథిగా హాజరైన రానా.. ఈ విషయాలన్నీ బయటపెట్టాడు. ఈరోజు రానా ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ కు వచ్చింది.

సొంత పరువు కూడా బాబుకి తాకట్టు