రంగ్ దే..పక్కా పైసా వసూల్

ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ కన్నా కావాల్సింది మరోటి లేదు. ఈ సంగతి తెలియక మాస్ అంటూ మిడిల్ రేంజ్ హీరోలు కిందా మీదా అయిపోతుంటారు. హీరో నితిన్ మళ్లీ ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి…

ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ కన్నా కావాల్సింది మరోటి లేదు. ఈ సంగతి తెలియక మాస్ అంటూ మిడిల్ రేంజ్ హీరోలు కిందా మీదా అయిపోతుంటారు. హీరో నితిన్ మళ్లీ ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వస్తున్నాడు. భీష్మతో మాంచి హిట్ కొట్టిన ఈ కొత్త పెళ్లి కొడుకు రంగ్ దే సినిమాను సంక్రాంతి కానుకగా ముస్తాబు చేస్తున్నాడు. తొలిప్రేమ, మజ్ఞు లాంటి మాంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి అందిస్తున్న రంగ్ దే నుంచి చిన్న టీజర్ కట్ ను హీరో నితిన్ పెళ్లి సందర్భంగా విడుదల చేసారు.

పక్కాగా పెళ్లి థీమ్ మీద ఈ టీజర్ ను కట్ చేయడం అన్నది టైమ్లీగా వుంది. స్టార్ కాస్ట్, సీన్ ఫ్రేమింగ్ అన్నీ కలిసి కలర్ ఫుల్ గా వుంది టీజర్. అల్లరి మార్కు ఫేస్ తో కీర్తి సురేష్ ఆకట్టుకునేలా వుంది. ఇన్నోసెన్స్ లుక్స్ నితిన్  కామెడీ  టైమింగ్, డైలాగ్ టైమింగ్ బాగుంది. దేవీశ్రీ ప్రసాద్ సెట్ చేసిన థీమ్ మ్యూజిక్ బాగా సూటయింది.

మొత్తం మీద రంగ్ దే ట్రయిలర్ ఇప్పటికే ఆ సినిమా మీద వున్న హోప్స్ ను మరింత పెంచింది.