cloudfront

Advertisement


Home > Movies - Movie News

రామ్‌ చరణ్‌ రైట్‌ టైమ్‌లో కొట్టాడు

రామ్‌ చరణ్‌ రైట్‌ టైమ్‌లో కొట్టాడు

ధృవ ఉపశమనం ఇచ్చినా కానీ రామ్‌ చరణ్‌ స్టార్‌డమ్‌ని పెంచే విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ చిత్రానికి వచ్చిన ఆరంభ వసూళ్లు, ఫుల్‌ రన్‌ కలక్షన్లు చూసి టాప్‌ 5హీరోల్లో స్థానం లేదని మీడియా తేల్చేసింది.

ఒకవైపు అల్లు అర్జున్‌ ప్రతి సినిమాతో స్టార్‌గా స్టామినా చాటుకుంటూ వుండగా, పవన్‌కళ్యాణ్‌ అజ్ఞాతవాసిలాంటి ఘోర పరాజయం తర్వాత రాజకీయాల వైపు వెళ్లిపోగా, మెగా కిరీటాన్ని కైవసం చేసుకునేదెవరు అనే ప్రశ్నలు తలెత్తిన సమయంలో రంగస్థలంతో వచ్చాడు రామ్‌ చరణ్‌.

మాస్‌ పల్స్‌ తెలియదని సుకుమార్‌ పట్ల ట్రేడ్‌ అంతగా నమ్మకాలు చూపించని నేపథ్యంలో వచ్చిన రంగస్థలం వాటిని పటాపంచలు చేసింది. అంచనాలకే అందని ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రెండు వారాల్లో వంద కోట్ల షేర్‌ వసూలు చేసింది.

మరి కొద్ది రోజుల్లో ఖైదీ నంబర్‌ 150ఫుల్‌ రన్‌ వసూళ్లని దాటి 'నాన్‌-బాహుబలి' రికార్డుని కూడా సొంతం చేసుకోనుంది. దీంతో బాక్సాఫీస్‌ పరంగాను 'మెగా వారసుడు' చరణ్‌ తప్ప మరొకరు కాదని అభిమాన లోకం ఆనందంలో మునిగి తేలుతోంది.

రంగస్థలం మిస్‌ఫైర్‌ అయినట్టయితే చరణ్‌ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. రాజమౌళితో చేస్తోన్న మల్టీస్టారర్‌ విజయవంతమైనా కూడా ఎన్టీఆర్‌, రాజమౌళికి క్రెడిట్‌ ఇచ్చేయాలనే యాంటీ వర్గం చూసేది.

ఇంతకంటే మంచి టైమింగ్‌తో బ్లాక్‌బస్టర్‌ సాధించలేరెవరూ అన్నట్టు రంగస్థలంతో రైట్‌ టైమ్‌లో తిరిగి టాప్‌ ప్లేస్‌ రేస్‌లోకి ఒక్కసారిగా వచ్చి చేరాడు చరణ్‌. ఇప్పుడు తన తోటి సూపర్‌స్టార్లపై ఈ విజయం ఒత్తిడి పెంచడం ఖాయం.