Advertisement

Advertisement


Home > Movies - Movie News

'తండ్రిని కావాల‌ని ఉంది' అన్న స్టార్ హీరో!

'తండ్రిని కావాల‌ని ఉంది' అన్న స్టార్ హీరో!

త‌ను తండ్రి కావాల‌నుకుంటున్న‌ట్టుగా చెప్పాడు బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్. కొంత‌కాలం కింద‌ట ర‌ణ్ వీర్ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకునేను పెళ్లి చేసుకున్న ఈ హీరో ఇప్పుడు తండ్రి కావాల‌నుకుంటున్న‌ట్టుగా చెప్పాడు. 

చాలా కాలం పాటు ప్రేమ‌లో మునిగి తేలింది ఈ జంట‌. త‌మ ప్రేమ‌బంధాన్ని బాహాటంగానే చాటుకున్నారు. దాని గురించి మాట్లాడ‌క‌పోయినా.. ఎంచ‌క్కా విదేశానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. మ‌రోవైపు ఇద్ద‌రూ సినిమాల‌తో బిజీగానే ఉన్నారు. స్టార్ హీరోయిన్ స్టేట‌స్ లో దీపిక వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ ఉంది.

ఈ క్ర‌మంలో ఆమె పిల్ల‌ల గురించి మాట్లాడ‌టం లేదు కానీ, ర‌ణ్ వీర్ మాత్రం పిల్ల‌లు క‌నాల‌నే ఆస‌క్తిని వ్య‌క్తం చేశాడు. పిల్ల‌లు కావాల‌ని, వారితో ఆడుతూపాడుతూ గ‌డ‌పాల‌ని ఉందంటూ ర‌ణ్ వీర్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇలా తండ్రి కావాల‌నే ఆస‌క్తిని వ్య‌క్తం చేశాడు ఈ బాలీవుడ్ హీరో. ర‌ణ్ వీర్ బ‌హిరంగంగా ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ మీద దీపిక ఏమంటుందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?