cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఇద్దరు హీరోయిన్లు.. ఒకేసారి కోలీవుడ్ ఎంట్రీ

ఇద్దరు హీరోయిన్లు.. ఒకేసారి కోలీవుడ్ ఎంట్రీ

ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్ల సినిమాలు కూడా ఒకేరోజు ప్రారంభమయ్యాయి. వాళ్లే రష్మిక, కల్యాణి ప్రియదర్శన్. వీళ్లిద్దరూ ఇప్పుడు ఒకేసారి కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో ఆల్రెడీ పాపులర్ అయింది రష్మిక. మంచి స్క్రిప్ట్, స్టార్ హీరో సెట్ అయితే కోలీవుడ్ లో ఎంట్రీ ఇద్దామని చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది.

ఎట్టకేలకు కార్తి రూపంలో ఆమెకు తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తి హీరోగా రానున్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది రష్మిక. చెన్నైలో ఈ మూవీ లాంఛింగ్ నిన్న గ్రాండ్ గా జరిగింది. రష్మికతో పాటు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మరో బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్.

తెలుగులో హలో సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీకి కోలీవుడ్ లో కూడా మంచి సర్కిల్ ఉంది. కానీ ఇప్పటివరకు అక్కడ ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఎట్టకేలకు శివకార్తికేయన్ హీరోగా ఓ తమిళ సినిమా చేస్తోంది. ఈ సినిమా నిన్ననే గ్రాండ్ గా లాంఛ్ అయింది.

ఈ మూవీ ఓపెనింగ్ కోసమే హైదరాబాద్ లో జరిగిన చిత్రలహరి టీజర్ లాంఛ్ కు ఆమె హాజరుకాలేదు. ఇలా ఒకేసారి కోలీవుడ్ లో అడుగుపెట్టారు రష్మిక, కల్యాణి ప్రియదర్శన్. వీళ్లలో ఎవరు క్లిక్ అవుతారో చూడాలి.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!