రష్మిక ఆహారం: కుక్క బిస్కెట్లు.. పంది మాంసం

రష్మిక ఆహారపు అలవాట్లు చాలా విచిత్రంగా, వింతగా ఉంటాయనే విషయం చాలామందికి తెలుసు. అప్పుడప్పుడు ఆమె కుక్క బిస్కెట్లు తింటుందనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా హీరో నితిన్ బయటపెట్టాడు. అవునంటూ రష్మిక తలూపింది.…

రష్మిక ఆహారపు అలవాట్లు చాలా విచిత్రంగా, వింతగా ఉంటాయనే విషయం చాలామందికి తెలుసు. అప్పుడప్పుడు ఆమె కుక్క బిస్కెట్లు తింటుందనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా హీరో నితిన్ బయటపెట్టాడు. అవునంటూ రష్మిక తలూపింది.

అంతేకాదు, మరో సందర్భంలో తనకు అన్నీ మిక్స్ చేసి తినడం అలవాటనే విషయాన్ని కూడా రష్మిక బయటపెట్టింది. అన్నం, కూర, పప్పు, పెరుగు, సాంబారు.. అన్నీ కలిపేసి ఒకేసారి తినడం తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన ఆహారపు అలవాట్లకు సంబంధించి మరో యాంగిల్ బయటపెట్టింది రష్మిక.

రష్మికకు పంది మాంసం అంటే చాలా ఇష్టం అంట. నిజానికి తన ప్రాంతంలో అది సంప్రదాయ వంటకం అని చెబుతోంది ఈ చిన్నది. బార్బెక్యూ పోర్క్ (కాల్చిన పందిమాంసం)తో 2 పెగ్గులు వైన్ తాగితే స్వర్గం చూడొచ్చని చెబుతోంది.

రష్మిక ఇంట్లో రెగ్యులర్ గా పోర్క్ తో చేసిన సంప్రదాయ వంటకాలు ఉంటాయట. అంతేకాదు.. వైన్ కూడా ఇంట్లోనే తయారుచేసుకుంటామని చెబుతోంది. మితంగా వైన్ తాగితే గుండెకు మంచిదంటూ ఓ సలహా కూడా ఇస్తోంది రష్మిక.

గ్రేటర్ గెలుపు ఎవరిది