Advertisement

Advertisement


Home > Movies - Movie News

ర‌ష్మిక అవ‌కాశాల కోస‌మా, ప్రేమ‌లో ప‌డిందా!

ర‌ష్మిక అవ‌కాశాల కోస‌మా, ప్రేమ‌లో ప‌డిందా!

మాట వ‌ర‌స‌కు అందో.. త‌మిళ‌నాట అవ‌కాశాలను ఒడిసి ప‌ట్ట‌డానికే ఆన్న‌దో.. లేక నిజంగానే ఎవ‌రైనా త‌మిళ వ్య‌క్తిని చూసుకుని ప్రేమ‌లో ప‌డిందో కానీ, త‌ను త‌మిళ ఇంటి కోడ‌లు కావాల‌నుకుంటున్న‌ట్టుగా సర‌దా స్టేట్ మెంట్ ఇచ్చింది ర‌ష్మిక‌!

ఈ క‌న్న‌డ భామ ప్ర‌స్తుతం చేతి నిండా అవ‌కాశాల‌తో ఉంది. తెలుగులో డిమాండ్ ఉన్నా, త‌మిళంలోనూ అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటోంది ఇప్పుడిప్పుడు. మాతృభాష క‌న్న‌డ సినిమాల‌ను లైట్ తీసుకుని భారీ రెమ్యూన‌రేష‌న్లు ఇచ్చే తెలుగు, త‌మిళ సినిమాల‌తో బిజీ అయ్యింది. ఈ విష‌యంలో క‌న్న‌డ వాళ్లే నిర‌స‌న తెలుపుతారు ర‌ష్మిక గురించి!

ప్ర‌త్యేకించి తొలి సినిమా తర్వాత క‌న్న‌డ హీరోతోనే ఎంగేజ్ మెంట్ చేసుకోవ‌డం, తెలుగులో అవ‌కాశాల‌తో బిజీ అయ్యాకా ఆ ఎంగేజ్ మెంట్ ను ర‌ద్దు చేసుకోవ‌డంపై క‌న్న‌డ మీడియా ర‌ష్మిక మీద గ‌రం అయ్యింది. ఇప్పుడు ఉన్న‌ట్టుండి త‌మిళ ఇంటి కోడ‌లు కావాల‌నుకుంటున్న‌ట్టుగా ర‌ష్మిక చెప్పుకొస్తోంది.

ఇంత‌కీ ఎందుక‌లా అనిపిస్తోందంటే.. త‌మిళ వంట‌కాల రుచి న‌చ్చింద‌ట‌, అందుకే అలా అనిపిస్తోంద‌ట‌. మ‌రి అంతేనో.. లేక వేరే విష‌యం ఏమైనా ఉందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?