cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

కామెడీ లాయర్ గా రవితేజ..!

కామెడీ లాయర్ గా రవితేజ..!

రవితేజ-త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ అయింది. నిన్న అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు కూడా. ఇప్పుడీ సినిమాలో రవితేజ పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ బయటకొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కామెడీ లాయర్ గా కనిపించబోతున్నాడు రవితేజ.

ఏ పాత్ర పోషించినా దానికి ఓ ఎనర్జీ ఇవ్వడం రవితేజ స్టయిల్. చివరికి అంధుడి పాత్రకు కూడా ఓ ఎనర్జీ, ఓ కిక్ ఇచ్చాడు. ఇప్పుడు లాయర్ క్యారెక్టర్ కూడా రవితేజ మార్క్ లోనే ఉండబోతోంది. ఈ ఎనర్జీతో పాటు డబుల్ మాస్ ఎంటర్ టైనర్ పక్కా అంటున్నాడు రచయిత బెజవాడ ప్రసన్నకుమార్.

ఎన్నో సినిమాల్లో పోలీస్ గా మెప్పించిన రవితేజ, ఈసారి లాయర్ గా కోర్టు హాల్ లో అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఇందులో కోర్టు సన్నివేశాలు కంటే, కోర్టు బయట సన్నివేశాలు, రవితేజ మార్క్ అల్లరి ఎక్కువగా ఉండబోతోంది. మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ కూడా లాయర్ గానే కనిపించబోతోంది.

ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇది పూర్తయిన వెంటనే త్రినాథరావు నక్కిన సినిమా సెట్స్ పైకి వస్తుంది. పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు. 

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ?

సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో న‌టించా

 


×