ఎట్టకేలకు ఆ సినిమాకు మోక్షం దక్కింది

రవితేజ-త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే ఖిలాడీ కంటే ముందు ఇదే స్టార్ట్ అవ్వాల్సింది. కానీ కొన్ని క్రియేటివ్ కారణాలు, మరికొన్ని పేమెంట్ కారణాల వల్ల లేట్…

రవితేజ-త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే ఖిలాడీ కంటే ముందు ఇదే స్టార్ట్ అవ్వాల్సింది. కానీ కొన్ని క్రియేటివ్ కారణాలు, మరికొన్ని పేమెంట్ కారణాల వల్ల లేట్ అయింది. ఈ గ్యాప్ లో ప్రాజెక్టు చేతులు మారిందని, వరుణ్ తేజ్ కు వెళ్లిందంటూ కథనాలు కూడా వచ్చాయి. అయితే రవితేజ-త్రినాధరావు నక్కిన మూవీ ఆగిపోలేదని, త్వరలోనే స్టార్ట్ అవుతుందని గతంలోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడు అదే నిజమైంది.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ అయింది. సోమవారం నుంచి సెట్స్ పైకి కూడా వెళ్లబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రొడక్షన్ హౌజ్ కూడా మారలేదు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నారు.

బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ అందించాడు. భీమ్స్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇంతకుముందు రవితేజ నటించిన బెంగాల్ టైగర్ అనే సినిమాకు కూడా ఇతడే సంగీత దర్శకుడు.

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ మేటర్ ఏంటంటే.. సినిమా టేబుల్ ప్రాఫిట్ తో  సెట్స్ పైకి వెళ్లబోతోంది. నిర్మాతలు ముందుగానే ఓటీటీ, శాటిలైట్, నార్త్ ఇండియా, నైజాం, ఆడియో లాంటి రైట్స్ అన్నీ మాట్లాడుకొని పెట్టుకున్నారు. త్వరలోనే ఆ డీటెయిల్స్ ను అందిస్తాం.

క్రాక్ సక్సెస్ తర్వాత ఖిలాడీకి రవితేజ ఎంత పారితోషికం అందుకున్నాడో, అంతే పారితోషికాన్ని ఈ కొత్త సినిమాకు కూడా అందుకుంటున్నాడు.