cloudfront

Advertisement


Home > Movies - Movie News

మరోసారి రొటీన్ లో పడిపోతున్నాడా..?

మరోసారి రొటీన్ లో పడిపోతున్నాడా..?

అదే లుక్, అదే యాక్టింగ్, అదే ఫార్ములా కథ.. రవితేజ మరోసారి రొటీన్ లో పడిపోతున్నాడా అనిపిస్తోంది నేలటిక్కెట్టు ట్రయిలర్ చూస్తుంటే. 2నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రయిలర్ లో కొత్తగా అనిపించిన అంశం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.

హీరో ప్రేమలో పడతాడు. తన కామెడీ గ్యాంగ్ తో కలిసి ఆమె వెంటపడతాడు. ఇంతలో విలన్ ఎంటర్ అవుతాడు. విలన్ వల్ల ఓ వర్గానికి సమస్య ఎదురవుతుంది. దానికి హీరోయిన్ కనెక్షన్ కూడా ఉంటుంది. హీరో రంగంలోకి దిగి మేటర్ సెటిల్ చేస్తాడు. హీరోయిన్ మనసు గెలుచుకుంటాడు.

ఇందులో కొత్తదనం ఏమైనా ఉందా..? ఇప్పటివరకు మనం చూడని యాంగిల్ ఏమైనా కనిపిస్తోందా..? నేలటిక్కెట్టు ట్రయిలర్ లో సరిగ్గా ఇదే ఉంది. ఇంతకుమించి ఇంకేం లేదు. ఇంకా చెప్పాలంటే.. నేలటిక్కెట్టు ట్రయిలర్ ఆ టైటిల్ కు తగ్గట్టే ఉంది. రొటీన్ సేమ్-ఓల్డ్ ఫార్ములా.

ఈ ట్రయిలర్ చూస్తుంటే కల్యాణ్ కృష్ణ ఏం చెప్పి రవితేజను ఒప్పించాడనే సందేహం కలుగుతుంది. అటు రవితేజకు కూడా ఇందులో కొత్తగా ఏం కనిపించిందనే అనుమానం కలుగుతుంది. ఇలా రొటీన్ కథలు చేసి గతంలో ఫ్లాపులు కొనితెచ్చుకున్నాడు రవితేజ. అంతెందుకు.. రీసెంట్ గా వచ్చిన టచ్ చేసి చూడు కూడా ఇలా రొటీన్ గా ఉండడం వల్లే ఫ్లాప్ అయింది.

నేలటిక్కెట్టు సినిమాలో ట్రయిలర్ ను మించి ఇంకేదైనా కొత్తగా ఉంటుందని ఆశిద్దాం. అది లేకపోతే మాత్రం ఎవరేం చేయలేరు. ఈనెల 25న థియేటర్లలోకొస్తోంది నేలటిక్కెట్టు.