
అదిగో సినిమా అంటే ఇదిగో కాన్సెప్ట్ అంటూ ఏదేదో రాసేయడం అలవాటైపోయింది. నిజానికి కాస్త ట్రయ్ చేస్తే ఏమిటి కాన్సెప్ట్ అన్నది కనుక్కోవడం అంత విషయం కాదు.
రవితేజ-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా కాన్సెప్ట్ గురించి ఇలాగే గ్యాసిప్ లు వచ్చేసాయి. రవితేజ లాయర్ అని, లాయర్ గా ఫుల్ కామెడీ చేయబోతున్నాడని, అలాగే హీరోయిన్ కూడా లాయర్ అనీ కథ అల్లేసారు.
కానీ నిజానికి అసలు సంగతేమిటంటే ఆ సినిమాలో రవితేజ క్యారెక్టర్ లాయర్ కానేకాదు. హీరోయిన్ కూడా అంతకన్నా కాదు.ఈ సినిమాలో రవితేజ బిజినెస్ మన్ గా కనిపించబోతున్నాడు.
అడ్డ దారులు తొక్కకుండా ఆర్గానిక్ గా ఎత్తుకు ఎదిగే క్రమంలో వచ్చే ట్విస్ట్ లు వగైరాలతో టోటల్ ఫన్ ను పండించబోతున్నారు. హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి వుంది. సినిమా మొత్తం మిడిల్ క్లాస్ నుంచి ఆపైకి ఎదిగే క్రమంగా వుంటుంది.
పీపుల్స్ మీడియా నిర్మించే ఈ సినిమా రవితేజ ప్రస్తుతం చేస్తున్న ఖిలాడీ పూర్తి కాగానే ఫుల్ స్పీడ్ లో సెట్ మీదకు వెళ్తుంది.